ప్రపంచ దేశాలలో యువతరం ఎక్కువగా ఉంటుంది. భారతదేశంలో కూడా యువత ఎక్కువ అనే సంగతి అందరికి తెలిసిందే. అయితే యువతరం ఆలోచనలు ఎప్పుడు కూడా సరదాలపైనే ఉంటాయి. కాలేజీ డేస్ ని కాలక్షేపం చేయడానికి ఎక్కువగా వినియోగిస్తారు. ఇండియాలో ఇంకా ఇలాంటి వాతావరణం తక్కువ కాని, విదేశాలలో అయితే విచ్చలవిడితనం చాలా ఎక్కువగా ఉంటుంది. అబ్బాయిలు, అమ్మాయిలు టీనేజ్ లోనే అన్ని రకాల కోరికలు తీర్చుకోవాలని భావిస్తారు. శృంగారం అనేది వారికి చాలా చిన్న విషయం. ఒకరికి ఒకరు నచ్చితే శృంగారం చేయడానికి రెడీ అయిపోతారు. ఇక ఇలాంటి ఆలోచనల కారణంగా కొన్ని దేశాలలో సుఖ వ్యాధులు ఎక్కువగా ప్రబలుతున్నారు.
వీటిని నిరోధించడానికి ఫ్రాన్స్ ప్రభుత్వం సరికొత్త విధానం అమల్లోకి తీసుకొచ్చింది. ఈ విషయాన్ని ఆ దేశ అధ్యక్షుడే అధికారికంగా ట్విట్టర్ వీడియో ద్వారా దృవీకరించారు. ఫ్రాన్స్ లో 18 ఏళ్ళు దాటిన అమ్మాయిలు, అబ్బాయిలకి కండోమ్స్ ఉచితంగా ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్ ఈ విషయాన్ని తెలియజేశాడు. వచ్చే ఏడాది ఆరంభం నుంచి కండోమ్స్ ఉచితంగా అన్ని ఫార్మాసీ షాపులలో లభ్యం అవుతాయని పేర్కొన్నారు. ఎవరైనా కావాల్సిన వారు నేరుగా మెడికల్ ఫార్మసీ షాపులకి వెళ్లి అడిగితే సరిపోతుందని పేర్కొన్నారు.
దేశంలో యువత శృంగారానికి అలవాటు పడి వ్యాధుల బారిన పడుతున్నారని, ఈ నేపధ్యంలో వాటి నుంచి రక్షణగా ఈ కండోమ్స్ ని ఉచితంగా పంపిణీ చేయడానికి శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ఇప్పుడు ఈ న్యూస్ సోషల్ మీడియాలో విస్తృతంగా వైరల్ అవుతుంది. గతంలో ఇండియాలో కూడా కండోమ్స్ కోసం పట్టణాలలో, గ్రామీణ ప్రాంతాలలో ప్రత్యేకంగా బాక్స్ లు ఏర్పాటు చేసి అందులో ఉంచేవారు. ఎవరైనా కావాల్సినవారు ఆ బాక్స్ ఓపెన్ చేసి కండోమ్స్ తీసుకెళ్ళే వెసులుబాటు కల్పించారు. ఎయిడ్స్ వ్యాధి నియంత్రణలో భాగంగా కండోమ్స్ ని 20 ఏళ్ళ క్రితం ఉచితంగా ఇండియాలో పంపిణీ చేశారు. ఇప్పుడు దీనిని ఫ్రాన్స్ ఫాలో అవుతూ ఉండటం విశేషం.