కమెడియన్ గా కెరియర్ స్టార్ చేసి మున్నా సినిమాతో ఫేమ్ సొంతం చేసుకున్న నటుడు వేణు. నల్ల వేణు అని టాలీవుడ్ లో అందరికి సుపరిచితం అయిన వేణు ఈ జెనరేషన్ లో అందరికి బాగా తెలుసు. టాలీవుడ్ లో మంచి కమెడియన్ గా ఉన్న అతి కొద్ది మందిలో అతను కూడా ఒకడు. జబర్దస్త్ రియాలిటీషోలోకి ఎంట్రీ ఇచ్చి అక్కడ ఆరంభంలో అదరగొట్టిన వేణు తరువాత ఎంతో మందిని తన టీమ్ ద్వారా పరిచయం చేశాడు. అలాగే వేణు టీమ్ లోకి చేస్తూ సక్సెస్ అయిన వారిలో సుడిగాలి సుధీర్ గెటప్ శ్రీను ఇప్పుడు ఏ రేంజ్ లో ఉన్నారో అందరికి తెలిసిందే. గెటప్ శ్రీను అయితే సినిమాలలో వరుస అవకాశాలు సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాడు.
ఇక సుడిగాలి సుధీర్ ఓ వైపు హీరోగా, మరో వైపు కమెడియన్ గా అవకాశాలు సొంతం చేసుకుంటూనే, యాంకర్ గా కూడా అలరిస్తున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు వేణు దర్శకుడిగా మెగా ఫోన్ పట్టాడు. ఈ విషయం ఆలస్యంగా బయటకి వచ్చింది. అది కూడా తనకి గుర్తింపు ఇచ్చిన దిల్ రాజు ప్రొడక్షన్ లోనే దర్శకుడిగా మొదటి సినిమా చేసినట్లు తెలుస్తుంది. తెలంగాణలో చేనేత ఆత్మహత్యల నేపధ్యంలో ఒక కథని సిద్ధం చేసుకొని దిల్ రాజుకి వినిపించడంతో అతనే వేణుని దర్శకుడిగా పరిచయం చేసే బాధ్యత తీసుకున్నారు. ఇక ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ కూడా కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ దశలో ఉన్నట్లు తెలుస్తుంది.
తక్కువ బడ్జెట్ లో తెరకెక్కించిన పెర్ఫెక్ట్ గా చేయడంతో దిల్ రాజు సినిమా అవుట్ ఫుట్ మీద కూడా సంతృప్తికరంగా ఉన్నాడని, త్వరలో టైం చూసుకొని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఒక వేళ దర్శకుడిగా వేణు సక్సెస్ అయితే టాలీవుడ్ లో కమెడియన్ నుంచి దర్శకుడిగా మారిన మరో టాలెంటెడ్ గా గుర్తింపు తెచ్చుకుంటాడు. అవసరాల శ్రీనివాస్ కమెడియన్ కమ్ సైడ్ హీరోగా కెరియర్ స్టార్ట్ చేసి దర్శకుడిగా సక్సెస్ అయ్యాడు. వెన్నెల కిషోర్ కూడా దర్శకుడిగా తన అదృష్టం పరీక్షించుకున్నాడు. ఇప్పుడు వేణు దర్శకుడిగా తన మార్క్ చూపించుకోవడానికి రెడీ అయ్యాడు. మరి అతనికి ఎంత వరకు సక్సెస్ వస్తుంది అనేది చూడాలి.