చియాన్ విక్రమ్ హీరోగా, అజయ్ జ్ఞానముత్తు దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం కోబ్రా. ఇక ఈ సినిమా ట్రైలర్ తోనే సినిమా మీద అంచనాలు పెరిగిపోయాయి. విక్రమ్ విభిన్న గెటప్స్, యాక్షన్ ఎలిమెంట్స్ తో, సరికొత్త కథ, కథనాలతో పాన్ ఇండియా రేంజ్ లో సినిమాని తెరకెక్కించారు. ఇక ఇండియన్ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ ఈ సినిమాలో ఓ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసందే. భారీ బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా రిలీజ్ సందర్భంగా పబ్లిక్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వస్తుంది.
కొంత మంది పర్వాలేదని మాట చెబుతూ ఉంటే, మంరికొందరు స్టోరీ రొటీన్ అయిన విక్రమ్ యాక్టింగ్, క్యారెక్టర్స్ వేరియేషన్స్, యాక్షన్ ఎపిసోడ్స్ కోసం సినిమా చూడొచ్చు అనే మాట చెబుతున్నారు. ఇక కోలీవుడ్ లో పాన్ ఇండియా రేంజ్ లో రిలీజ్ అయ్యి సక్సెస్ కొట్టిన సినిమాలు ఈ మధ్య కాలంలో లేవని చెప్పాలి. మొదటి సారి విక్రమ్ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకి వచ్చాడు. ఇక యిప్పటికే విక్రమ్ తన గత సినిమాలతో పాన్ ఇండియా స్థాయిలో అందరికి రీచ్ అయ్యాడు.
ఈ నేపధ్యంలో కోబ్రా ట్రైలర్ కూడా ఆకట్టుకోవడంతో సినిమా మీద అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఆ అంచనాలని విక్రమ్ అందుకున్నట్లే కనిపిస్తుంది. విక్రమ్ యాక్టింగ్ సూపర్ గా ఉందని, అద్భుతమైన యాక్షన్ ఎపిసోడ్స్ కి తోడు లాస్ట్ 30 నిమిషాలు సినిమా మరో రేంజ్ లో ఉంటుందని టాక్ వినిపిస్తుంది. అలాగే సినిమాలో రివీల్ అయ్యే ట్విస్ట్ కూడా అద్భుతంగా ఉందని, థ్రిల్లర్ ఎలిమెంట్స్ కూడా ఆకట్టుకునే విధంగా ఉన్నాయనే అభిప్రాయాన్ని పుబ్లిక్ వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ టాక్ బట్టి చూస్తే చాలా గ్యాప్ తర్వాత విక్రమ్ ఖాతాలో సరైన హిట్ పడిందనే మాట వినిపిస్తుంది. మరి లాంగ్ రన్ లో సినిమా ఏ మేరకు రీచ్ అవుతుంది అనేది సినిమా రేంజ్ ని డిసైడ్ చేస్తుంది.