Cm Ys Jagan: సీఎం వైఎస్ జగన్ ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో ముగ్గురు మంత్రులపై సీరియస్ అయినట్లు మీడియాలో వార్తలు వచ్చాయి. తన కుటుంబంపై టీడీపీ నేతలు ఆరోపణలు చేస్తున్నా మాట్లాడటం లేదని, సైలెంట్ గా ఉంటున్నారని మంత్రివర్గ సమావేశంలోనే అందరి సమక్షంలో ముగ్గురి మంత్రులపై జగన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు వైసీపీ పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. వ్యక్తిగతంగా తన ఫ్యామిలీని టార్గెట్ చేస్తూ ఆరోపణలు చేస్తున్నా కౌంటర్ ఇవ్వకపోవడం ఏంటని, మీకు మంత్రి పదవి ఇచ్చి ఏం లాభమని జగన్ గుస్సా అయినట్లు చెబుతున్నారు. ఇలాగే ఉంటే అవసరమైతే మంత్రివర్గం నుంచి అయినా బర్త్ రఫ్ చేయడానికి వెనుకడాదని ముగ్గురు మంత్రులకు జగన్ హెచ్చరికలు జారీ చేశారట.
ఈ క్రమంలో నవంబర్ లో మంత్రివర్గవ ఉంటుందని, ఆ ముగ్గురికి కేబినెట్ నుంచి ఉద్వాసన పలుకుతారనే ప్రచారం నడుస్తోంది. అయితే ఇప్పుడు మరో వార్త ప్రచారంలోకి వచ్చింది. ముగ్గురు కాదని, ఐదుగురు మంత్రులను జగన్ మందలించినట్లు చెబుతున్నారు. ఇందులో ఇద్దరు మంత్రులు రెండో దఫాలో మంత్రి పదవి దక్కించుకున్నారనే టాక్ నడుస్తుంది. ఇద్దరు మహిళా మంత్రులు, ముగ్గురు పురుష మంత్రులు ఉన్నారనే ఊహాగానాలు వినిపిస్తున్నాియ. గతంలో టీడీపీలో ఉన్న ఈ ఐదుగురు మంత్రులు టీడీపీతో టచ్ లో ఉంటూ మంచి సంబంధాలు నడుపుతున్నారని జగన్ గుర్తించారట. ఓ మత్రి ఇటీవల ఓ నియోజకవర్గ టీడీపీ నాయకుడి కూతురి పెళ్లికి ఓ మంత్రి మరిది వెళ్లి ఏకంగా ఐదు లక్షల రూపాయాల విలువ చూసే బంగారు కానుక ఇచ్చినట్లు ప్రచారం సాగుతోంది.
Cm Ys Jagan:
అలాగే ఓ మహిళా మంత్రికి కీలక శాఖ ఇచ్చినా.. ప్రభుత్వం, పార్టీపై ప్రతిపక్షాలు చేసే ఆరోపణలపై ఇప్పటివరకు ఒక్కసారి కూడా కౌంటర్ ఇవ్వలేదట. ఇక పల్నాడు, రాయలసీమ, కోస్తా జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రకు చెందిన మంత్రులు జగన్ లిస్టులో ఉన్నారట. ఈ ఐదుగురిపై త్వరలో వేటు పడటం ఖాయమనే ప్రచారం వైసీపీ సర్కిల్స్ లో బలంగా జరుగుతోంది. మరో రెండు లేదా మూడు నెలల్లో కేబినెట్ కూర్పు జరగుుతుందని, వీరిపై వేటు పడుతుందనే ప్రచారం జరుగుతోంది. కొద్దిరోజుల పాటు వీరికి జగన్ టైమ్ ఇచ్చారట. అప్పటికీ ఇలాగే కొనసాగితే పదవి ఉస్టే అని అంటున్నారు. దీంతో మంత్రులందరూ ఇప్పుడిప్పుడే బయటికి వచ్చి ప్రతిపక్ష పార్టీల విమర్శలకు దీటైన సమాధానాలు ఇస్తున్నారు. తమ మంత్రి పదవిని కాపాడుకునేందుకు ఇక తప్పనిసరి పరిస్థితుల్లో ప్రతిపక్షాలపై విమర్శల దాడికి సిద్దమవుతున్నారు. దీంతో ఇప్పుడు జగన్ సీరియస్ అయిన మంత్రులు ఎవరు అనే దానిపై వైసీపీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది. సదరు నేతల పేర్లు ఏంటి అనేది వైసీపీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.