అయిపోయింది అనుకున్న కోవిడ్ మళ్ళీ విజృంభిస్తుంది.దీంతో ప్రజలు భయాందోళనలు చెందుతున్నారు.దీంతో దేశంలోని పలు రాష్ట్రాలలో ఆంక్షలు మళ్ళీ తెరపైకి వచ్చాయి.తాజాగా తెలంగాణలో కోవిడ్ ఉదృతిని కట్టడి చేసేందుకు కేసీఆర్ సర్కార్ సంక్రాంతి సెలవలని పొడిగించారు.ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ లో పరిస్థితి కాస్తా మెరుగ్గా ఉన్న రోజు వారి కేసుల సంఖ్య పెరుగుతుండడంతో మళ్ళీ లాక్ డౌన్స్ వస్తాయి ఏమో అని అందరూ భావిస్తున్నారు.
ఇలాంటి నేపథ్యంలో ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు కోవిడ్ పాజిటివ్ అని నిర్ధారణ అయ్యింది.ప్రస్తుతం ఆయన ఐసోలేషన్ లో ఉన్నారు.తనతో కాంటాక్ట్ అయిన వారంతా ఇప్పుడు టెస్ట్ లు చేయించుకుంటున్నారు.