CM KCR New Party: తెలంగాణ సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి ఇప్పటికే అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఇప్పటికే దేశవ్యాప్తంగా తిరుగుతూ బీజేపీయేతర, కాంగ్రెసేతర సీఎంలను, నేతలను కలిసి జాతీయ రాజకీయాల్లోకి ఎన్డీయే, యూపీఏకు ప్రత్యామ్నాయంగా ఫ్రంట్ ఏర్పాటు చేయడంపై దృష్టి పెట్టారు. అయితే కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు చేసే ఆలోచన ఉన్నట్లు గతంలో సీఎం కేసీఆర్ టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశంలో బహిరంగా ప్రకటించారు. కానీ కొత్త జాతీయ పార్టీపై ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన రాలేదు. దీంతో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఇప్పుడు ఉంటుందా.. లేదా అనే దానిపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ క్రమంలో కేసీఆర్ కొత్త జాతీయ పార్టీపై ఏర్పాటుపై క్లారిటీ వచ్చింది. అంతేకాదు కొత్త జాతీయ పార్టీకి ప్రకటనకు ముహూర్తం కూడా ఫిక్స్ అయింది. హైదరాబాద్ వేదికగానే సీఎం కేసీఆర్ కొత్త జాతీయ పార్టీని ప్రకటించనున్నారు. ఈ నెల 11న కొత్త జాతీయ పార్టీని అనౌన్స్ మెంట్ చేయనున్నారు. పార్టీ పేరు కూడా ఆ రోజే ప్రకటించే అవకాశముంది. 11న కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి తెలంగాణకు రానున్నారు. సీఎం కేసీఆర్ ను కలిసి మోదీకి వ్యతిరేకంగా రాజకీయ ఫ్రంట్ పై చర్చించనున్నారు. ఆ రోజే కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటన ఉంటుందని చెబుతున్నారు.
CM KCR New Party:
ఇవాళ తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులందరూ కలిసి మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాలని కోరారు. నేడు రాష్ట్రంలోని టీఆర్ఎస్ జిల్లా కమిటీలు కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి వెళ్లాల్సిందిగా తీర్మానాలు చేయనున్నారు. దీని బట్టి చూస్తే కేసీఆర్ కొత్త పార్టీకి ముహూర్తం ఫిక్స్ అయినట్లే తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల తర్వాత కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఉంటుందని అందరూ భావించారు. కానీ వచ్చే ఎన్నికల్లో టీఆర్ఎస్ మరోసారి అధికారంలోకి వస్తుందని కేసీఆర్ బలంగా నమ్ముతున్నట్లు తెలుస్తోంది. అందుకే రాష్ట్ర రాజకీయాలను వదిలేసి జాతీయ రాజకీయాల్లో అడుగు పెట్టనున్నారని సమాచారం