నల్గొండ జిల్లా దాసరి నెమిలిపూర్ గ్రామంలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది వేడుకల్లో భాగంగా గురువారం నిర్వహించిన చెరువుల పండుగ సందర్భంగా వడిత్య పాండు మృతి పట్ల ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు సంతాపం తెలిపారు. దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రనాయక్ వినతి మేరకు మృతుల కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపి వారికి రూ.5 లక్షల ఉదార విరాళం ప్రకటించారు.