CM Kcr: సీఎం కేసీఆర్ సంచలన ప్రకటన చేశారు. రాష్ట్రంలోని గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ ప్రకటిస్తున్నట్లు తెలిపారు. వచ్చే వారమే దీనిపై అధికారికంగా జీవో జరీ చేస్తామని ప్రకటించారు. కేంద్రాన్ని ఇప్పటివరకు అనేకసార్లు అడిగి విసిరి వేశారిపోయామని, ఇక వేచి చూసేది లేదన్నారు. మా రిజర్వేషన్ మేమే చూసుకుంటామని కేసీఆర్ తేల్చిచెప్పారు. శనివారం ఎన్టీఆర్ స్టేడియంలో జరిగిన ఆదివాసీ, బంజారాల ఆత్మీయ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా గిరిజనులకు రాష్ట్రంలో రిజర్వేషన్లు ప్రకటించారు. మోదీ ఈ రిజర్వేషన్ల జీవోను గౌరవించి అనుమతి ఇస్తారా లేదా దాన్నే ఊరితాడా వేసుకుంటారా అనేది తేల్చుకోవాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.
ఉమ్మడి రాష్ట్రంలో గిరిజనులకు 5 శాతమే రిజర్వేషన్ ఉందని, తాము పది శాతానికి పెంచి అసెంబ్లీలో తీర్మానం చేసి కేంద్రానికి పంపామన్నారు. కేంద్రానికి పంపి ఏడు సంవత్సరాలు అవుతున్నా.. కేంద్రం బిల్లును ఆపుతుందని కేసీఆర్ చెప్పారు. మోదీ పుట్టినరోజున చేతులు జోడించి ప్రశ్నిస్తున్నానని, గిరిజనుల 10 శాతం రిజర్వేషన్ బిల్లుకు రాష్ట్రపతితో అమోదముద్ర వేయించాలని కేసీఆర్ కోరారు. రిజర్వేషన్ పెంచడానికి కేంద్ర ప్రభుత్వం ఎందుకు అడ్డు తగులుతుందో చెప్పాలని కేసీఆఱ్ పర్శ్నించారు. పక్క రాష్ట్రంలో ఇచ్చిన రిజర్వేషన్ మాకెందుకు ఇవ్వరని కేసీఆర్ ప్రశ్నించారు.
CM Kcr:
రిజర్వేషన్ వెంటనే పెంచాలని ఈ సబ ఏకగ్రీవంగా తీర్మానం చేస్తోందని కేసీఆర్ తెలిపారు. జాతీయ పార్టీ పెట్టాలని కొంతమంది మహారాష్ట్ర నుంచి తెలంగాణకు వచ్చి తనను కలిసి మద్దతు తెలిపారని కేసీఆర్ వెల్లడించారు. ధనవంతులకే దేశ సంపదను మోదీ దోచిపెడుతున్నారని, దళిత బంధులాగే గిరిజన బంధు కూడా ప్రారంభిస్తామని కేసీఆర్ స్పష్టం చేశారు. పోడు భూములను సాగు చేసుకునే రైతులకు కూడా రైతుబంధును అమలు చేస్తామని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. రాష్ట్రంలో గిరిజన గురుకులాల సంఖ్యను ఇంకా పెంచుతామని కేసీఆర్ ప్రకటించారు. సంపద పెంచడం, అవసరమైన పేదలకు పంచడమే తమ సిద్దమని కేసీఆర్ స్పష్టం చేశారు.