తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఆధ్వర్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంపై సమీక్షా సమావేశం ప్రారంభమైంది.
ఈ సమావేశానికి వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, కోఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ప్రాంతీయ సమన్వయకర్తలు హాజరయ్యారు. ఈ సమావేశంలో జూలై 1 నుంచి నిర్వహించనున్న జగనన్న సురక్ష కార్యక్రమంపై ముఖ్యమంత్రి చర్చించి కొత్త బాధ్యతలు అప్పగించడంతో పాటు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలకు ఈ సందర్భంగా దిశానిర్దేశం చేయనున్నారు.
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి వైఎస్‌ఆర్‌సీపీ ప్రభుత్వం జగనన్నకు చెబుదాం కార్యక్రమంతో పాటు జగనన్న సురక్ష కార్యక్రమాన్ని కూడా తీసుకురానుంది. దాదాపు నెల రోజుల పాటు ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నారు.
