ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వం థియేటర్స్ వ్యవహారంలో వ్యవహరిస్తున్న తీరు చూస్తుంటే సినిమా వారిపై కక్ష సాధింపు చర్యని ప్రజలు ఫీల్ అవుతున్నారు. సినిమా టికెట్స్ తగ్గిస్తూ ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవోపై కోర్టులలో విచారణ జరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు ఆకస్మాత్తుగా రాష్ట్రంలో పలు చోట్ల థియేటర్స్ లో తనిఖీలు నిర్వహించారు.సరిగ్గా భద్రతా ప్రమాణాలు లేని థియేటర్స్ ను,అధిక రేట్లకు టికెట్స్ విక్రయిస్తున్న థియేటర్స్ కు సీల్ వేశారు.
ప్రభుత్వ అధికారులు ఆకస్మిక తనిఖీలలో దాదాపు 20 థియేటర్స్ కు తాళాలు వేశారు.ఇది చూసిన సినీ విశ్లేషకులు భద్రతా ప్రమాణాలు, ప్రభుత్వ నిబంధనలను పాటించని థియేటర్స్ కు సీల్ వేయడం తప్పు కాదు కానీ పాన్ ఇండియా చిత్రాలు రిలీజ్ కు దగ్గర పడుతున్న వేళ టికెట్ రేట్ల పై కోర్టులో కేసులు నడుస్తున్న వేళ ప్రభుత్వం ఇలా వ్యవహరించడం ఏంటి?ఆయన టికెట్ రేట్ల మీద కాదు థియేటర్స్ లో పాప్ కార్న్,కూల్ డ్రింక్స్ పేరుతో దోచుకుంటున్నారు వాటిపై దృష్టి సారించండి అని ప్రభుత్వానికి సూచిస్తున్నారు.