Cm Jagan: సీఎం వైఎస్ జగన్ ప్రస్తుతం ఏపీ సీఎంగా బాధ్యతలు నిర్వర్తిస్తు్న్నారు. గత ఎన్నికల్లో ఇచ్చిన హామీలైన నవరత్నాలను అమలు చేస్తున్నారు. సంక్షేమ పథకాలను అమలు చేస్తూ ప్రజలకు చేరువవుతున్నారు. కానీ అభివృద్ధిని మాత్రం పూర్తిగా దూరం పెట్టారు. సంక్షేమంలో ముందు ఉన్న జగన్.. అభివృద్ధి పనులు చేయడంలో బాగా వెనుకబడి ఉన్నారనేది ప్రజల్లో జరుగుతున్న చర్చ. సంక్షేమ పథకాలే వచ్చే ఎన్నికల్లో తమకు మరోసారి అధికారాన్ని తెచ్చి పెడతాయని జగన్ నమ్ముతున్నట్లు ఆయన తీరును బట్టి చూస్తే అర్ధమవుతుంది. అభివృద్ధిని జనం పట్టించుకోరని, సంక్షేమ పథకాలు వస్తు్న్నాయా.. లేదా అనేది మాత్రమే ప్రజలు చూస్తారనే అభిప్రాయంలో జగన్ ఉన్నట్లు తెలుస్తోంది. అయితే జగన్ ను వైసీపీ ఎమ్మెల్యేలు తెగ పొగిడేస్తు్న్నారు. రోజా, కొడాలి నాని లాంటి నేతలైతే ఇందులో ముందు వరసులో ఉంటాయి.
తాజాగా వారి సరసన మరో ఎమ్మెల్యే చేరారు. జగన్ మరో 30 ఏళ్లు ఏపీకి సీఎంగానే ఉంటారని గతంలో వైసీపీ ఎమ్మెల్యే కామెంట్లు చేసిన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు ఓ వైసీపీ ఎమ్మెల్యే మరో ముందడుగు వేశారు. జగన్ ను ఏకంగా దేశానికే ప్రధానిని చేశారు. ఇంతకు ఆ ఎమ్మెల్యే ఎవరో కాదు. నెల్లూరు జిల్లాలోని కోవూరు ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. జగన్ దేశానికే ప్రధాని అవుతారని తాజాగా వ్యాఖ్యానించారు. దీంతో ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వైసీపీ శ్రేణులు మాత్రం ఆయన వ్యాఖ్యలను పాజిటివ్ గా తీసుకుంటుండగా.. ప్రతిపక్ష పార్టీ కార్యకర్తలు మాత్రం సెటైర్స్ వేస్తూ సోషల్ మీడియాలో ట్రోల్స్ చేస్తున్నారు.
అయితే గతంలో టాలీవుడ్ నటులపై తీవ్ర వ్యాఖ్యలు చేసిన ప్రసన్నకుమార్ రెడ్డి పాపులర్ అయ్యారు. టాలీవుడ్ హీరోలు, నిర్మాతలకు బలిసిందా అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. టికెట్ల రేట్లపై ఏపీ ప్రభుత్వం, టాలీవుడ్ మధ్య వివాదం జరుగుతున్న సమయంలో ప్రసన్నకుమార్ రెడ్డి చేసిన ఈ కామెంట్స్ తీవ్ర దుమారం రేపాయి.
Cm Jagan:
అయితే మంత్రి పదవి రాలేదనే కారణంతో జగన్ పై ప్రసన్నకుమార్ రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొనలేదు. కానీ తర్వాత జగన్ వార్నింగ్ ఇవ్వడంతో ఇప్పుడు గడపగడపకు మన కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అయితే వచ్చే ఎన్నికల్లో ప్రసన్నకుమార్ రెడ్డికి టికెట్ ఇచ్చే అవకాశ లేదని వైసీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. జగన్ అభ్యర్థులను మార్చనున్న నియోజకవర్గాల్లో కోవూరు కూడా ఉందని అంటున్నారు. అందుకే జగన్ ను ప్రసన్నం చేసుకునేందుకు ప్రసన్నకుమార్ పొగడ్తలు మొదలుపెట్టారనే టాక్ వినిపిస్తోంది.