అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో పుష్ప 2 మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. పుష్ప సీక్వెల్ గా ఈ మూవీని సుకుమార్ ఆవిష్కరిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా లెవల్ లో మొదటి సినిమాకి మించి ఉండే విధంగా ఈ మూవీని రెడీ చేస్తున్నారు. ఇక అందుకు తగ్గట్లుగానే క్యాస్టింగ్ ని కూడా అదనంగా యాడ్ చేస్తున్నారు. ఇక సెకండ్ పార్ట్ ముఖ్యంగా అల్లు అర్జున్, ఫాహద్ ఫాజిల్ మధ్యలో కథ నడుస్తుందని, వారి మధ్య ఆధిపత్యపోరుగా సినిమా కంటెంట్ మరింత స్ట్రాంగ్ కథనంతో ఉంటుందని టాక్. ఇక రష్మిక ఎప్పటిలాగే ఈ సినిమాలో గ్లామర్ తో ఆకట్టుకోవడానికి రెడీ అవుతుంది. ఇక మలైకా అరోరాని ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం తీసుకుంటున్నట్లు టాక్.
ఇక ప్రియమణి కూడా నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతుందని, ఆమె ఒక పొలిటికల్ లీడర్ గా పుష్ప2లో నటించబోతుంది అనే మాట ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. ఇక కంటెంట్ డిమాండ్ బట్టి పుష్ప2తో ఈ సిరీస్ ని ముగించాలా లేదా పార్ట్ 3 కూడా కొనసాగిస్తారా అనేది సుకుమార్ డిసైడ్ చేసే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే అక్టోబర్ 1 నుంచి ఈ మూవీ షూటింగ్ అల్లు అర్జున్ నిర్మించిన అల్లుస్టూడియోలో స్టార్ట్ కాబోతుందని టాక్. ఇదిలా ఉంటే ఈ సారి సినిమాని గ్యాప్ లేకుండా వరుస షెడ్యూల్స్ తో వీలైనంత వేగంగా పూర్తి చేయాలని సుకుమార్, అల్లు అర్జున్ డిసైడ్ అయినట్లు బోగట్టా.
అలాగే సినిమాని ఏప్రిల్ 2023న ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. మూడు నెలల్లో సినిమా షూటింగ్ పూర్తి చేసి మరో రెండు నెలల్లో పోస్ట్ ప్రొడక్షన్ కంప్లీట్ చేసి ఏప్రిల్ నెలలో సరైన డేట్ చూసుకొని రిలీజ్ కి రెడీ అవ్వాలని భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. ఇక సినిమా షూటింగ్ ప్రారంభించిన రోజే రిలీజ్ డేట్ కూడా ఎనౌన్స్ చేసే అవకాశం ఉందని చెప్పుకుంటున్నారు. ఇక ఈ సినిమాలో సాయి పల్లవి కూడా ఓ కీలకమైన పాత్రలో కనిపించబోతుంది అనే మాట చాలా రోజులుగా వినిపిస్తుంది. అలాగే మొదటి భాగంలో ఉన్న సునీల్, అనసూయ పాత్రలు కూడా ఇందులో కొనసాగుతాయని తెలుస్తుంది.