Chrandramukhi2: తమిళంలో చేసిన ఓ సినిమా.. తెలుగులో కూడా భారీ కలెక్షన్లు రాబట్టిన సీన్ చంద్రముఖి విషయంలో జరిగింది. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా, నయనతార, జ్యోతిక, ప్రభులు కీలక పాత్రల్లో వచ్చిన ఈ సినిమా హార్రర్ కామెడీగా జనాలకు విపరీతంగా నచ్చింది. సినిమా ఎంతో ఆసక్తికరంగా ఉండటంతో పాటు రజినీకాంత్ హీరోయిజం, వడివేల్ కామెడీ, జ్యోతిక యాక్టింగ్ సినిమాను వేరే లెవల్ కి తీసుకెళ్లాయి.
చంద్రముఖి సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా విపరీతంగా ఆదరించగా.. ఈ సినిమాకు త్వరలోనే సీక్వెల్ రాబోతోంది. అయితే ఈ సీక్వెల్ లో హీరోగా రజినీకాంత్ కాకుండా.. కొరియోగ్రాఫర్, డైరెక్టర్, యాక్టర్ అయిన రాఘవ లారెన్స్ మెయిన్ క్యారెక్టర్ చేస్తున్నాడు. అయితే ఇటీవలే ఈ సినిమా సీక్వెల్ కు సంబంధించిన అధికారిక ప్రకటన విడుదల కాగా.. అందరూ ఈ సినిమా గురించి ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
తాజాగా ఈ సీక్వెల్ కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. చంద్రముఖి మొదటి భాగంలో జ్యోతిక అదరగొట్టగా.. సీక్వెల్ కోసం కాజల్ అగర్వాల్ ను అనుకుంటున్నారట. దీంతో కాజల్ అగర్వాల్ ఈ క్యారెక్టర్ కు సరిపోతుందా? లేదా ? అనే చర్చ సాగుతోంది. కాజల్ అగర్వాల్ భయపెడుతుందా అనే అనుమానాన్ని చాలామంది వ్యక్తపరుస్తున్నారు.
Chrandramukhi2:
చంద్రముఖి సీక్వెల్ రాఘవ లారెన్స్ చేస్తున్నాడనే వార్త విన్న తర్వాత చాలామంది సినిమా అదిరిపోతుందని కామెంట్ చేశారు. కానీ కాజల్ చంద్రముఖిగా నటించబోతోందనే వార్త విన్న తర్వాత మాత్రం.. ఎక్కడో అనుమానం వ్యక్తం చేస్తున్నారు. మరి ఈ సినిమా తెలియాలంటే మరికొన్ని రోజులు ఆగాల్సిందే. కాగా పెళ్లి చేసుకొని, పండంటి బిడ్డకు జన్మనిచ్చిన కాజల్.. గత కొంతకాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే.