Chota k Naidu: హైదరాబాద్‌లో జరిగిన అలయ్ బలయ్ వేడుకలో జరిగిన రచ్చ ఇంకా చల్లారడం లేదు. ప్రవచనకర్త గరికపాటి నరసింహారావు మెగాస్టార్ చిరంజీవి మీద అసహనం వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఒక మహా పండితుడు అవతల ప్రవచనాలు ప్రారంభిస్తే మెగాస్టార్ ఫోటో సెషన్ ఆరంభించారు. ఇది అనుకోకుండా జరిగింది. కావాలని చేసింది కాదు. అయితే ఆ సమయంలో గరికపాటి వారు చిరంజీవిపై అసహనం ప్రదర్శించారు. ఫోటో సెషన్ ఆపి చిరు ఇవతలికి రాకుంటే తాను అక్కడి నుంచి వెళ్లిపోతానన్నారు. దీన్ని మెగా ఫ్యాన్స్ జీర్ణించుకోలేకపోతున్నారు.
అయితే నాగబాబు, ఉత్తేజ్‌తో సహా.. మెగా ఫ్యాన్స్ అంతా గరికపాటిపై దండయాత్ర చేస్తూనే ఉన్నారు. దీంతో గరికపాటి దిగొచ్చి చిరుకి క్షమాపణ తెలియజేస్తూ ఒక ప్రకటన విడుదల చేశారు.ఆ రోజు జరిగిన దానికి సిగ్గుతో తలవంచి క్షమాపణ కోరుతున్నానన్నారు. చిరంజీవి సహృదయంతో స్వీకరిస్తారని ఆశిస్తున్నానంటూ ప్రకటనలో వేడుకున్నారు. అయినా కూడా దండయాత్ర ఆగలేదు. చిరు ముందే గాడ్ ఫాదర్ సక్సెస్ మీట్‌లో ఛోటా కె నాయుడు వాడు.. వీడు అంటూ గరికపాటిపై శివాలెత్తడం గమనార్హం. అని చిరు మిన్నకుండిపోయారు.
ఇండియన్ స్క్రీన్‌లో చిరంజీవితో పోల్చడానికి ఎవరూ సరిపోరని ఛోటా కె నాయుడు పేర్కొన్నారు. అక్కడి వరకూ బాగానే ఉంది కానీ.. అలాంటి వ్యక్తిని వాడెవడో తక్కువ చేసి మాట్లాడారంటూ శివాలెత్తడమే కాస్త ఇబ్బందికరంగా అనిపించింది. ‘చిరంజీవిపై అభిమానంతో ఫొటోలు తీసుకుంటున్నాం.. మాట్లాడేవాడు మహాపండితుడు.. అలా మాట్లాడొచ్చా? అది తప్పు కదా..’ అని ఛోటా పేర్కొన్నారు. చిరంజీవి తనకు గురువని.. దైవమని.. తల్లి, తండ్రి అన్ని అంటూ ఎమోషనల్ అయిపోయారు. ఛోటా అలా మాట్లాడుతుంటే చిరు చేతులెత్తి నమస్కారం చేశారు.