Cholesterol control: సాధారణంగా మన బాడీలో కొలెస్ట్రాల్ మామూలు స్థాయిలో ఉంటే ప్రమాదం లేదు. అయితే, మనం తీసుకొనే ఆహారాన్ని బట్టి, కొవ్వు పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే మనకు తెలియకుండానే కొలెస్ట్రాల్ శాతం పెరిగిపోతుంది. అది ఎలాంటి సగ్నల్స్ లేకుండానే మన శరీరాన్ని డ్యామేజీ చేసేస్తుంది. మనకు ఏ గుండెజబ్బు లాంటిదో వచ్చినప్పుడు మాత్రమే కొలెస్ట్రాల్ ఎక్కువైందని తెలుస్తుంది. అధిక కొవ్వు శాతం మన ప్రాణాలకే ముప్పు తెచ్చి పెడుతుంది. అలాంటి కొలెస్ట్రాల్ ను అదుపులో ఉంచడం చాలా కష్టమైన పని అయినప్పటికీ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం పత్పనిసరి.
బాడీలో కొవ్వు శాతం ఎక్కువైతే కొన్ని లక్షణాలు మనకు తెలిసిపోతాయి. అధిక కొలెస్ట్రాల్ వల్ల హై బీపీ వస్తుంది. కరోనరీ హార్ట్ డిసీజ్ కూడా సోకే ప్రమాదం ఉంది. గుండె పోటు, పెరిపెరల్ వాస్కులర్ వ్యాధులు వస్తాయి. ఇది డయాబెటిస్ తో ముడి పడి ఉంటుంది. మరి ఇంతటి ప్రమాదకరమైన కొలెస్ట్రాల్ శాతాన్ని సరైన సమయానికి గుర్తించడం అవసరమని గుండె నిపుణులు హెచ్చరిస్తున్నారు.
రక్తంలో కొవ్వు ఉందని గుర్తించాక దాన్ని అనేక మార్గాల ద్వారా తగ్గించుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. అధిక కొవ్వును కరిగించి సాధారణ స్థితికి చేర్చడం పెద్ద కష్టమేమీ కాదంటున్నారు. జీవనశైలి మార్పులు, బరువుపై నియంత్రణ అనేవి కొలెస్ట్రాల్ స్థాయిలను డిసైడ్ చేస్తాయి. ముఖ్యంగా తినే ఆహారంలో జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వ్యాధులు దరిచేరకూడదంటే నియంత్రణ పాటించాలి.
Cholesterol control:
చెడు కొవ్వును పెంచే ఆహార పదార్థాలను కచ్చితంగా తప్పించాలి. ఫాస్ట్ ఫుడ్ ను వీలైనంత మేర తగ్గించాలి. ఇంట్లో తాజాగా వండుకున్న పదార్థాలైతే బెటర్. ఆకుకూరలు గుండె ఆరోగ్యాన్ని పదిలం చేస్తాయి. బీన్స్, బెండ, వెజిటబుల్ ఆయిల్స్, ఓట్స్, పండ్లు తీసుకోవాలి. తగిన వ్యాయామం కూడా ఉండాలి. ఎన్నిసార్లు జాగ్రత్తలు తీసుకున్నా ఫలితం లేదనుకున్నప్పుడు త్వరగా వైద్యుడిని సంప్రదించాలి. వీలైనంత వరకు సిగరెట్, ఆల్కహాల్ కు దూరంగా ఉండటం మంచిది. రోజులో కొంత సమయం కుటుంబంతో సరదాగా గడపడం నేర్చుకోవాలి. రోజులో కాసేపైనా నవ్వుతూ ఉంటే ఆరోగ్యంగా ఉంటారు.