చియాన్ విక్రమ్ అంటే కొత్తదనం ఉన్న పాత్రలకి కేరాఫ్ అడ్రెస్ అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అతని సినిమా వస్తుంటే అంటే కచ్చితంగా ఏదో ఒక ఇంటరెస్టింగ్ పాయింట్ టచ్ చేస్తాడనే అభిప్రాయం ఉంటుంది. పొన్నియన్ సెల్వన్ సినిమాలో ఆదిత్య కరికాలన్ పాత్రలో విక్రమ్ విమర్శకుల ప్రశంసలు అందుకున్నాడు. ప్రస్తుతం పా.రంజిత్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమా షూటింగ్ కడపలో రీసెంట్ గా స్టార్ట్ చేశారు. దీపావళి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ఎనౌన్సమెంట్ తో పాటు కాన్సెప్ట్ టీజర్ ని కూడా రిలీజ్ చేసి సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా ఈ టీజర్ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఇందులో విక్రమ్ గెడ్డంతో కేవలం గోచి మాత్రమే పట్టుకొని ఒంటిపై బట్ట లేకుండా ట్రైబల్ కమ్యూనిటీకి చెందిన వ్యక్తిగా ఉన్నాడు.
అతని లుక్, ఆహార్యం సరికొత్తగా కనిపిస్తుంది. అలాగే టీజర్ లో బ్రిటిష్ వారిని కూడా ఎలివేట్ చేశాడు. దీనిని బట్టి స్వాతంత్య్రంకి ముందు జరిగిన కాన్సెప్ట్ అని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో విక్రమ్ కి జోడీగా మాళవిక మోహనన్ కనిపిస్తుంది. ఆమె కూడా ట్రైబల్ విమెన్ పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తుంది. తమ హక్కుల కోసం ఆదిమజాతికి చెందిన ఒక కులం వారు చేసే పోరాటంగా ఈ మూవీ కాన్సెప్ట్ ఉండబోతుందని టీజర్ బట్టి తెలుస్తుంది. ఇక ఈ సినిమాకి తంగలాన్ అనే టైటిల్ ని కన్ఫర్మ్ చేశారు.
సంచార జాతులలో బాగా తక్కువ కులానికి చెందిన వారి హక్కుల కోసం చేసే పోరాటంగా ఈ మూవీ కాన్సెప్ట్ ఉంటుందని టీజర్ బట్టి తెలుస్తుంది. జీవి ప్రకాష్ కుమార్ కుమార్ సంగీతం అందిస్తున్నాడు. విజువల్ లో వాతావరణం, చిన్న గుడిసెలు, వారి ఆహార్యం చూస్తుంటే మాత్రం పా.రంజిత్ ఈ సారి కొత్త తమిళ మూలాల్లోకి వెళ్లి వాస్తవ సంఘటన ఆధారంగా కథని ఎంచుకున్నాడు అని అర్ధం అవుతుంది. మరి విక్రమ్ కూడా ఇలాంటి పాత్రలో ఇప్పటి వరకు నటించలేదు. మరి ఏ మేరకు ఈ సినిమా అతనికి సక్సెస్ ఇస్తుందనేది చూడాలి.