Mahesh Babu: సూపర్ స్టార్ మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి నిన్న మరణించడం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ప్రముఖులు ఇంకా పలువురు రాజకీయ నాయకులు ఇందిరా దేవి భౌతికకాయానికి నివాళులర్పించారు. అలాగే కృష్ణ, మహేష్ బాబుని పరామర్శించారు. ఈ క్రమంలో మెగాస్టార్ చిరంజీవి తన ట్విట్టర్ లో “శ్రీమతి ఇందిరాదేవి గారు స్వర్గస్తులయ్యారు అనే వార్త ఎంతో కలచివేసింది. ఆ మాతృదేవత ఆత్మకి శాంతి చేకూరాలని కోరుకుంటూ, సూపర్ స్టార్ కృష్ణ గారికి , సోదరుడు మహేష్ బాబుకి, కుటుంబ సభ్యులందరికీ నా ప్రగాఢ సానుభూతిని తెలియచేస్తున్నాను” అని స్పందించారు.
ఇక అదే సమయంలో తన కొత్త సినిమా “గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్ వేడుక నిన్న అనంతపురంలో జరిగిన టైంలో కూడా వేదికపై చిరంజీవి తన ప్రగాఢ సానుభూతి తెలియజేయడం జరిగింది. నిన్న “గాడ్ ఫాదర్” ప్రీ రిలీజ్ వేడుక నేపథ్యంలో చిరంజీవి రాలేకపోయారు. అయితే నేడు కృష్ణ మరియు మహేష్ బాబుని చిరంజీవి కలిశారు. ఈ సందర్భంగా ఇందిరా దేవి చిత్రపటానికి నివాళి అర్పించారు.
అనంతరం తల్లి కోల్పోయిన బాధలో ఉన్న మహేష్ బాబునీ ఇంకా భార్య కోల్పోయి బాధలో ఉన్న కృష్ణనీ చిరంజీవి ఓదార్చడం జరిగింది. ఈ సందర్భంగా చిరంజీవి.. కృష్ణ, మహేష్ బాబుతో కలిసి కూర్చున్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఒక ఇదే సందర్భంలో తెలంగాణ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సైతం మహేష్ బాబు, కృష్ణనీ పరామర్శించడం జరిగింది.