Chiranjeevi: తెలుగు సినిమా ఇండస్ట్రీలో అంచలంచలుగా ఎదిగి.. ఇప్పుడు ఇండస్ట్రీకే పెద్ద దిక్కుగా మారాడు మెగాస్టార్ చిరంజీవి. 1978లో ‘పునాది రాళ్లు’ సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన చిరంజీవి.. తన నటనతో అందరినీ మెప్పించి మెగాస్టార్ గా ఎదిగాడు. తాజాగా ‘గాడ్ ఫాదర్’ సినిమాతో మాస్ ప్రేక్షకులకు అదిరిపోయే ఫీస్ట్ ఇచ్చాడు. దసరా పండగకు మెగా ఫ్యాన్స్ కు నిజమైన పండగ తెచ్చాడు.
మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా సినీ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్.. తనదైన స్టైల్ తో, యాక్టింగ్ తో తెలుగు సినిమా రంగంలో ఎవరికీ లేనంత ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. పవర్ స్టార్ గా అభిమానుల్లో తిరుగులేని క్రేజ్ ను సొంతం చేసుకున్న పవన్ కళ్యాణ్ సినిమా చేస్తున్నారంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దలవ్వాల్సిందే.
తెలుగు నాట ఇంతటి విపరీతమైన క్రేజ్ ను సొంతం చేసుకున్న ఈ ఇద్దరు హీరోలు స్క్రీన్ మీద కనిపిస్తే.. అభిమానులు చేసే సందడి వేరే లెవల్ లో ఉంటుంది. వీరిద్దరు కలిసి ఒక మల్టీస్టారర్ సినిమా చేయాలని ఎప్పటి నుండో అభిమానుల నుండి ఉన్న డిమాండ్. తాజాగా చిరంజీవి చేసిన ‘గాడ్ ఫాదర్’ భారీ హిట్ కాగా.. సక్సెస్ మీట్ పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ సినిమా మీద ఆసక్తికర కామెంట్లు చేశారు.
Chiranjeevi:
పవన్ కళ్యాణ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమా చేయడానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, కాకపోతే మంచి కథ దొరికి, మంచి డైరెక్టర్ ఉంటే ఖచ్చితంగా సినిమా చేస్తానని చిరంజీవి వెల్లడించాడు. దీంతో తెలుగు సినిమా ఇండస్ట్రీలో త్వరలోనే అదిరిపోయే మల్టీస్టారర్ వచ్చే అవకాశాలు గట్టిగా ఉన్నాయని మెగా అభిమానులు గట్టిగా నమ్ముతున్నారు. మొత్తానికి చిరంజీవి మల్టీస్టారర్ సినిమాకు ఓకే చెబుతూ చేసిన కామెంట్.. ఇప్పుడు మెగా అభిమానుల్లో ఆశలను చిగురింపజేసింది.