మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా వాల్తేర్ వీరయ్య. ఈ మూవీలో మాస్ మహారాజ్ రవితేజ ఓ కీలక పాత్రలో కనిపించబోతున్నాడు. పోలీస్ ఆఫీసర్ గా అతని పాత్ర ఉండబోతుంది. ఇప్పటికే రవితేజ క్యారెక్టర్ ఫస్ట్ లుక్ టీజర్ ని తాజాగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ ఆకట్టుకుంది. ఇక ఈ మూవీలో చిరంజీవికి జోడీగా శృతి హాసన్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక శృతి హాసన్, చిరంజీవికి ఈ సినిమాలో ఒక డ్యూయెట్ కూడా ఉంది. తాజాగా ఈ డ్యూయెట్ కి సంబందించిన అప్డేట్ ని దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చారు. త్వరలో సాంగ్ లెరికల్ వీడియో వస్తుందని కన్ఫర్మ్ చేశాడు. అయితే ఇంతలో మెగాస్టార్ చిరంజీవి ఈ సాంగ్ కి సంబంధించి ఆసక్తికరమైన వీడియో ఒకటి ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు.
నువ్వు శ్రీదేవి అయితే నేను చిరంజీవి అంటా అంటూ సాగే ఈ సాంగ్ చిత్రీకరణ స్విట్జర్లాండ్ లో షూటింగ్ జరిగిందని ఆ వీడియోలో మెగాస్టార్ చెప్పారు. మైనస్ 8 డిగ్రీల టెంపరేచర్ లో సాంగ్ ని షూట్ చేయడం జరిగిందని, అయితే మంచు పడుతున్న సమయంలో అక్కడి దృశ్యాలు చాలా అద్బుతంగా ఉన్నాయని చిరంజీవి వీడియోలో పంచుకున్నారు. ఇలాంటి వాతావరణం చాలా అద్బుతంగా అనిపించింది అని చెప్పారు.
అలాగే చిత్ర యూనిట్ మొత్తం చాలా కష్టపడి సాంగ్ ని షూట్ చేసారని, ఫ్యాన్స్ కోసం తాను కూడా కష్టాన్ని భరించి మంచులో శృతి హాసన్ తో కలిపి స్టెప్పులు వేసినట్లు చెప్పుకొచ్చారు. ఇక ఫైనల్ గా సాంగ్ కి సంబంధించి చిన్న లెరిక్ ని కూడా లీక్ చేస్తున్నట్లు చెప్పి సాంగ్ బిట్ ని రివీల్ చేశారు. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దేవిశ్రీ ప్రసాద్ ఈ సాంగ్ ని పాడాడని తెలుస్తుంది. ఇక శృతి హాసన్, చిరంజీవి డాన్స్ చేసిన స్టిల్ ని కూడా చిరంజీవి వీడియోలో షేర్ చేయడం విశేషం.