మెగాస్టార్ చిరంజీవి ఈ మధ్యకాలంలో ఎక్కువగా రీమేక్ కథలపై దృష్టి పెడుతున్నారు. వాటిని తెలుగులో తన స్టైల్ కి ఎడాప్ట్ చేసుకొని, ఇష్టమైన దర్శకులని ఎంపిక చేసుకొని వారితో తీయించుకుంటున్నారు. అది కూడా తనకి సెట్ అయ్యే విధంగానే అన్ని హంగులు ఉండే విధంగా చిరంజీవి దగ్గరుండి ఆ సినిమా కథ బాధ్యతని కూడా తీసుకుంటున్నారు అని గాడ్ ఫాదర్ సినిమాతోనే అర్ధమైంది. ఈ మూవీ లూసీఫర్ రీమేక్ గా తెరకెక్కిన సంగతి తెలిసిందే. ఇక దీని తర్వాత మెహర్ రమేష్ దర్శకత్వంలో చేస్తున్న సినిమా భోళా శంకర్ తమిళ్ హిట్ మూవీకి రీమేక్ గా తెరకెక్కుతుంది. ఈ మూవీ షూటింగ్ పూర్తయ్యింది.
ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య అనే సినిమాని మెగాస్టార్ చిరంజీవి చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ జరుగుతుంది. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో రీమేక్ కథకి చిరంజీవి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వాల్తేర్ వీరయ్య తర్వాత వెంకీ కుడుములు దర్శకత్వంలో సినిమా చేస్తానని చిరంజీవి కమిట్ అయ్యారు. అయితే ఫైనల్ కథ విషయంలో మెగాస్టార్ సంతృప్తి చెందకపోవడంతో ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయ్యింది. ఇప్పుడు ఆ ప్లేస్ లోకి ప్రభుదేవా వచ్చినట్లు తెలుస్తుంది. తాజాగా గాడ్ ఫాదర్ లో థార్ మార్ థక్కర్ మార్ సాంగ్ కి ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. గతంలో చిరంజీవితో శంకర్ దాదా జిందాబాద్ అనే సినిమాకి ప్రభుదేవా దర్శకత్వం వహించారు.
అయితే ఆ మూవీ డిజాస్టర్ అయ్యింది. తరువాత ప్రభుదేవా బాలీవుడ్ లో వరుస సక్సెస్ లతో స్టార్ దర్శకుడిగా మారిపోయాడు. ఈ నేపధ్యంలో మళ్ళీ మెగాస్టార్ తెలుగులో దర్శకుడిగా రీఎంట్రీ ఇవ్వడానికి ప్రభుదేవాకి అవకాశం ఇచ్చినట్లు తెలుస్తుంది. స్పానిష్ థ్రిల్లర్ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు. ఒక రిటైర్డ్ డాన్ ఫ్యామిటీ చుట్టూ నడిచే స్టోరీ అది. ఆ సినిమా మేకింగ్ బాధ్యతని పూర్తిగా ప్రభుదేవాకి అప్పగించాలని చిరంజీవి భావిస్తున్నట్లు టాక్ వినిపిస్తుంది. మరి ఇందులో వాస్తవం ఎంత అనేది అఫీషియల్ గా కన్ఫర్మ్ అయ్యేంత వరకు తెలియదు.