Chiranjeevi : గత కొద్ది రోజులుగా మెగాస్టార్ చిరంజీవి.. కొన్ని ట్వీట్స్ చేస్తూ తన సినిమా ‘గాఢ్ ఫాదర్’పై హీట్ పెంచిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలన్నీ ఫలానా పార్టీ గురించేనంటూ విపరీతమైన ప్రచారం జరిగింది. ఈ ప్రచారంతో ‘గాఢ్ ఫాదర్’ మూవీ డైలాగ్స్ జనాల్లోకి బాగా వెళ్లిపోయాయి. మొత్తానికి ఈ ట్వీట్స్ తెలుగు రాష్ట్రాల్లో రచ్చ లేపాయి. అయితే తాజాగా ఆయన ‘గాఢ్ ఫాదర్’ మూవీ టీంతో కలిసి ప్రెస్‌మీట్‌లో పాల్గొన్నారు.
ఈ ప్రెస్‌మీట్‌లో భాగంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చారు. ఈ సందర్భంగా తాను ఏ రాజకీయ నాయకుల గురించి ఎలాంటి సెటైర్లు వేయలేదని చిరు క్లారిటీ ఇచ్చారు. కేవలం వాటిని సినిమా డైలాగ్స్‌గానే చూడాలన్నట్టు చెప్పుకొచ్చారు. మాతృకలో ఉన్న కథ ఆధారంగానే డైలాగులు రాయడం జరిగిందని చిరు వెల్లడించారు. ఆ డైలాగులు విని ఎవరైనా భుజాలు తడుముకుంటే తానేమీ చేయలేనన్నారు. ఇక తన తమ్ముడు జనసేన అధినేత పవన్ కల్యాణ్ గురించి కూడా మెగాస్టార్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భవిష్యత్‌లో పవన్‌కు అవసరమైతే అండగా నిలుస్తానని స్పష్టం చేశారు.
Chiranjeevi : ఫ్యూచర్‌లో పవన్ బెస్ట్ నాయకుడు అవుతాడు
‘‘భవిష్యత్‌లో సపోర్ట్ చేయగలనేమో నాకు తెలియదు. ఎందుకంటే వాడు నా తమ్ముడు. తన నిబద్దత, నిజాయితీ గురించి చిన్నప్పటి నుంచి తెలుసు నాకు. అందులో ఎక్కడా కూడా పొల్యూట్ అవలేదండి. అంతటి నిబద్దత ఉన్న నాయకుడు మనకు రావాలి. వాళ్లు ఏ పక్షాన ఉంటారు? ఎలా ఉంటారనేది భవిష్యతులో ప్రజలు నిర్ణయిస్తారు. బట్ అలాంటి వాడు రావాలనే నా ఆకాంక్ష. దానికి డెఫినెట్‌గా నా సపోర్ట్ ఉంటుంది. నేనొక పక్కన తనొక పక్కన ఉండటం కంటే.. విత్ డ్రా చేసుకుని సైలెంట్ అవడమే.. తను ఎమర్జ్ అవుతాడు.. ఫ్యూచర్‌లో బెస్ట్ నాయకుడు అవుతాడు. ఏమో ఏలే అవకాశం ప్రజలు తనకు ఇస్తారేమోనని నేను భావిస్తాను అలాంటి రోజు రావాలని కూడా నేను కోరుకుంటున్నాను’’ అని చిరు పేర్కొన్నారు.
. @KChiruTweets heartfelt words about @pawankalyan & extended his support for @JanaSenaParty !! pic.twitter.com/AqdFCmo6QQ
— chinuu!!! (@LohithRoyal18) October 4, 2022