మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా అక్టోబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా పాన్ ఇండియా లెవల్ లో రిలీజ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో మెగాస్టార్ తో పాటు సల్మాన్ ఖాన్ కూడా నటిస్తూ ఉండటంతో దేశవ్యాప్తంగా ఈ మూవీకి మంచి బజ్ క్రియేట్ అయ్యింది. ఇక సౌత్ ఇండియా లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఈ సినిమాలో కీలకమైన పాత్రలో చిరంజీవి చెల్లెలుగా నటిస్తుంది. దీంతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. మలయాళీ హిట్ మూవీ లూసీఫర్ రీమేక్ కావడంతో కచ్చితంగా హిట్ అవుతుందనే మాట వినిపిస్తుంది.
లూసీఫర్ లో మెయిన్ విలన్ పాత్రని వివేక్ ఒబెరాయ్ నటించారు. పవర్ ఫుల్ పాత్రలో అతను మెప్పించాడు. గాడ్ ఫాదర్ లో ఆ పాత్రని యంగ్ స్టార్ సత్యదేవ్ చేస్తున్న సంగతి తెలిసిందే. చిరంజీవితో సమానమైన పాత్రగా గాడ్ ఫాదర్ లో సత్యదేవ్ రోల్ ఉంటుంది. అయితే ఆ పాత్రకి సత్యదేవ్ ని తీసుకోవాలనే ఆలోచన డైరెక్టర్ కి కాదంట. చిరంజీవి అతన్ని ఏరికోరి ఎంపిక చేసినట్లు టాక్. సత్యదేవ్ నటించిన సినిమాలు ఓటీటీలో చూసిన మెగాస్టార్ చిరంజీవి అతని ఇంటెన్సివ్ పెర్ఫార్మెన్స్ కి ఫిదా అయిపోయారు.
ఈ సందర్భంగా ఓ సారి అతనిని ఇంటికి పిలిచి మరీ అభినందించారు. ఇక గాడ్ ఫాదర్ సినిమాలో విలన్ పాత్ర గురించి చర్చ వచ్చినపుడు సత్యదేవ్ అయితే పెర్ఫెక్ట్ ఛాయస్ అని భావించి అతన్ని దర్శకుడికి రిఫర్ చేశారు. చిరంజీవి నేరుగా సత్యదేవ్ కి ఫోన్ చేసి గాడ్ ఫాదర్ లో నెగిటివ్ రోల్ పోషించాలని అడిగినట్లు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు. సత్యదేవ్ కూడా వెంటనే ఆ పాత్ర చేయడానికి అంగీకరించాడని మెగాస్టార్ చెప్పారు. అతని పెర్ఫార్మెన్స్ గాడ్ ఫాదర్ లో కచ్చితంగా హైలైట్ గా ఉంటుందని సినిమాకి అదనపు బూస్ట్ అవుతుందని ప్రశంసించారు.