మెగాస్టార్ చిరంజీవిని ప్రస్తుతం ఇండస్ట్రీలో అందరూ ఒక పెద్దగా ఉంచి గౌరవిస్తున్నారు. అవకాశం ఉన్న ప్రతి సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్ ని వచ్చి కొత్తవారిని ఆశీర్వదిస్తున్నారు. అలాగే అన్ని సినిమాలకి తన విషెస్ అందిస్తున్నారు. పెద్దన్నగా ఉంటూ ఇండస్ట్రీ బాగు కోసం పని చేస్తున్నారు. ఈ విషయంలో టాలీవుడ్ ఇండస్ట్రీది అంతా ఒకటే మాట అనే సంగతి అందరికి తెలిసిందే. ఇక తాజాగా చిరంజీవి ఫస్ట్ డే ఫస్ట్ షో మూవీ ప్రీరిలీజ్ వేడుకకి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అయితే ఈ వేడుకలో ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ముఖ్యంగా దర్శకులకి నేరుగా తగిలాయి అనే మాట వినిపిస్తుంది. ఈ మధ్య కాలంలో సినిమాలు చూడటానికి ఆడియన్స్ థియేటర్స్ కి రావడం మానేశారు. అందుకే సినిమాలు ఆడటం లేదనే మాట అందరూ చెబుతున్నారు.
అయితే అందులో వాస్తవం ఉందని నేను అస్సలు అనుకోను. సినిమా బాగుంటే, ఎగ్జైట్ చేసి, సంతృప్తి పరిస్తే ఎప్పుడైనా థియేటర్స్ కి ఆడియన్స్ వస్తారు. ఓటీటీలో సినిమా చూడటానికి ఆడియన్స్ అలవాటు పడినా కూడా థియేటర్ ఎక్స్ పీరియన్స్ ని కూడా ఆడియన్స్ కోరుకుంటారు. అయితే దీనికి కావాల్సింది ఆడియన్స్ కి నచ్చే బలమైన కంటెంట్. అలాంటి కంటెంట్ ఉన్నాయి కాబట్టి తాజాగా బింబిసారా, సీతారామం, కార్తికేయ2 సినిమాలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. అయితే మంచి కంటెంట్ తయారు చేయడం అనేది దర్శకుల పని, ఇప్పుడు దర్శకులు అందరూ సినిమా రిలీజ్ డేట్ ముందే అనౌన్స్ చేసేసి, ఆ డేట్ కి రిలీజ్ చేయాలి అని ఆదరాబాదరాగా సినిమా చేస్తున్నారు. పేక్షకుడికి ఎం ఇవ్వాలో ఆలోచించడం మానేసి ప్రమోషన్ మీద దృష్టి పెడుతున్నారు.
ఈ అలవాటుని మార్చుకోవాలి. సినిమా మీద వేలాది మంది ఆధారపడి ఉంటారు. హిట్స్ రేట్ పెరిగితేనే వాళ్లంతా బ్రతికేది. ఈ విషయంలో నేను కూడా బాధితుడిని. సరైన కంటెంట్ లేక నా సినిమా కూడా ఆడలేదు. దర్శకుల ఆలోచన విధానం ఇప్పటికైనా మార్చుకొని కథ సినిమాకి ప్రాణం అనే విషయాన్ని అర్ధం చేసుకొని, ప్రేక్షకుడు ఏం కోరుకుంటున్నాడో అర్ధం చేసుకొని అలాంటి కంటెంట్ ని అందించే ప్రయత్నం చేస్తే హిట్స్ వాటికవే వస్తాయి అని మాట్లాడారు. ఈ వ్యాఖ్యలు కొరటాల శివతో పాటు హీరో ఇమేజ్ తో హిట్ కొడదాం అని ఆలోచించే ప్రతి దర్శకుడికి నేరుగా తగిలింది అనే మాట వినిపిస్తుంది.