Chiranjeevi : స్టార్స్ ఎక్కడ కనిపించినా సోషల్ మీడియా అక్కడ వాలిపోతుంటుంది. వారు మాట్లాడే ప్రతి మాటను పొల్లు పోకుండా శ్రద్ధగా విని ఏదో ఒక ఇష్యును హైలెట్ చేస్తూ ఉంటారు. అందులోనూ మెగాస్టార్ చిరంజీవి మీటింగ్ పెడితే మామూలుగా ఉండదు. ఆయన మాట్లాడే ప్రతి మాట జనంలోకి వెళుతుంది కాబట్టి సోషల్ మీడియా చాలా అలర్ట్ గా ఉంటుంది. తాజాగా చిరంజీవి బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య సినిమాలో హీరోగా నటిస్తున్నారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన సాంగ్స్, టీజర్, పోస్టర్లు సోషల్ మీడియాలో సెన్సేషన్ ను క్రియేట్ చేస్తున్నాయి. ఈ సంక్రాంతి బరిలో దిగేందుకు వాల్తేరు వీరయ్య సిద్ధంగా ఉంది. ఈ క్రమంలో ఓ ప్రెస్ కాన్ఫరెన్స్ ని మూవీ యూనిట్ ఏర్పాటు చేసింది. ఈ మీడియా సమావేశానికి మెగాస్టార్ చిరంజీవితో సహా మూవీ యూనిట్ పాల్గొంది.

ఈ సందర్భంగా మాట్లాడిన మెగాస్టార్ చిత్రానికి సంబంధించిన సన్నివేశాలను షూటింగ్ చేసిన పద్ధతిని, మూవీ యూనిట్ సభ్యుల గురించిన విషయాలను ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడారు. అంతా బాగానే ఉన్నా మెగాస్టార్, వాల్తేరు వీరయ్య లో కీలక పాత్ర పోషించిన రవితేజ గురించి మాట్లాడటం మర్చిపోయారు. దీంతో దొరికిందే ఛాన్స్ గా ఈ విషయం గురించి సోషల్ మీడియాలో చర్చ మొదలైంది. మెగాస్టార్ కి రవితేజకు మధ్య ఏం జరిగింది? చిరంజీవి రవితేజ గురించి ఎందుకు మాట్లాడలేదు ఆయన్ని ఎందుకు మర్చిపోయినట్టు అంటూ డిబేట్ ను మొదలు పెట్టారు.

ఇక ఈ విషయం ఇలా ఉంచితే మెగాస్టార్ చిరంజీవి గారు ట్విట్టర్ వేదికగా రవితేజ గురించి ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. మూవీ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ అంతా సంతోషంగా జరిగిన ఎక్కడో చిన్న లోటు కనిపించిందని, తన తమ్ముడు రవితేజ గురించి చెప్పడం మరచిపోయానని ఆయన ట్విట్టర్ వేదికగా తెలిపారు.

సినిమా గురించి చెప్పగానే అన్నయ్య పక్కన నటించేందుకు రవితేజ ఓకే అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని చిరంజీవి తెలిపారు. చాలా సంవత్సరాల గ్యాప్ తర్వాత రవితేజతో నటిస్తుండటం చాలా ఆనందంగా ఉందన్నారు. వాల్తేరు వీరయ్య లో రవితేజ లేకపోతే ఎక్కడో లోటు ఉండేదని ఆయన పేర్కొన్నారు. మెగాస్టార్ మర్చిపోకుండా ఇలా రవితేజను సోషల్ మీడియా వేదికగా కొనియాడటంతో అభిమానులు ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆయన గొప్పతనాన్ని ప్రశంసిస్తున్నారు.
