Chinmayi : ఫేమస్ గాయని చిన్మయి సోషల్ మీడియా వేదికగా మరోసారి కాంట్రావర్సీ కామెంట్ చేసింది. తన అనుభవాలను జోడించి యువ కథానాయికకు సూచనలు అందించింది. మీటూ లో భాగంగా చిన్మయి రచయిత వైరాముత్తుని పాయింట్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఆ పోస్ట్ ఇప్పుడు ఇంటర్నెట్ వైరల్ అయింది.

సినీ ఇండస్ట్రీలో కాంప్రమైజ్ కానిదే అవకాశాలు రావని ఇప్పటికే చాలామంది యువ కథానాయికలు, సింగర్స్ వారు ఎదురుకున్న ఫిజికల్ హరాజ్మెంట్ కి సంబంధించిన విషయాలను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. ఈ విషయంలో చాలామంది పెద్దలు ఇరుక్కుని అభాసు పాలయ్యారు. అప్పట్లో మీటూ ఉద్యమం పెద్ద ఎత్తున సాగింది చాలామంది కథానాయకులు కెరీర్ ప్రారంభంలో వారు ఎదుర్కొన్న ఇబ్బందులను సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు.

అదే సమయంలో సింగర్ చిన్మయి కోలీవుడ్ నిర్మాత, రచయిత అయిన వైరామత్తు పైన ఆరోపణలు చేసింది. అతని బిహేవియర్ గురించి అప్పట్లో ఆమె చేసిన ట్వీట్స్ పెద్ద దుమారమే రేపాయి. తాజాగా చిన్నయి మరోసారి వైరామత్తు పైన ఆరోపణలు చేసింది.

కోలీవుడ్ లో యువ నటిగా ఎదుగుతున్న అర్చన ఇటీవలే రచయిత వైరామత్తు ను కలిసింది అతనితో దిగిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ పిక్స్ ను ఉద్దేశించి ఉన్నాయి ఘాటుగా స్పందించింది. మొదటిసారి ఆయన గొప్ప వ్యక్తిగానే కనిపిస్తాడని ఆ తర్వాతే అతని అసలు రూపం బయటపడుతుందని కాబట్టి ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని యువనటికి సూచించింది. అదేవిధంగా వీలైనంతవరకు అతడికి దూరంగా ఉండమంటూ హిత బోధన చేసింది. ఇక పక్కన ఎవరూ లేకుండా ఒంటరిగా మాత్రం అతడిని కలవద్దు అంటూ హెచ్చరించింది. యూనిటీ అర్చన ఫోటోలు అదేవిధంగా చిన్మయి కామెంట్స్ ఇప్పుడు నెట్ లో వైరల్ గా మారాయి.
