చెరపకురా చెడేవు అని మన పెద్దలు ఊరకనే చెప్పలేదని ప్రస్తుతం చైనాను చూస్తుంటే అర్థం అవుతుంది.గత కొంతకాలంగా చైనా ప్రభుత్వం షిన్‌జియాంగ్ ప్రావిన్స్‌లోని వీగర్ ముస్లింలను టార్చర్ చేస్తుంది.ఈ విషయం ప్రపంచానికి తెలిసిన దానిపై ఆశించిన స్పందన రాలేదు.ముఖ్యంగా ముస్లింలకు అండగా ఉంటాం అని కథలు చెప్పే ఇస్లామిక్ దేశాలు,ఉగ్రవాదులు చైనా డబ్బుల కోసం సైలెంట్ అయిపోయారు.
ఆఫ్ఘనిస్తాన్ ను తాలిబన్ లు హస్తగతం చేసుకుంటే దాన్ని స్వాగతించిన చైనాకు ఇప్పుడు దానివల్లే సమస్యలు ఎదురుకానున్నాయి.తాలిబాన్ లకు శత్రువులైన ఐ.ఎస్.ఐ.ఎస్ కురసాన్ టెర్రరిస్ట్ వర్గంలో ఇప్పుడు వీగర్ ముస్లిం వర్గం,పాకిస్తాన్ లోని బాలుచ్ వర్గం పెద్ద ఎత్తున చేరుతున్నారు.గతంలో ఐ.ఎస్.ఐ.ఎస్ కురసాన్ చైనాపై జిహాద్ చేస్తామని ప్రకటించారు.అలాంటి టెర్రర్ ఔట్ ఫిట్ లో ఇప్పుడు చైనాను ద్వేషించే వీగర్ లు,బాలుచ్ లు చేరుతుండటంతో చైనా ఆందోళన చెందుతుంది.ఈ ఇస్లామిక్ తీవ్రవాదులు సరిహద్దు దాటి తమ వైపుకు వస్తారేమో అని చైనా భయపడుతుంది.