China : వివాహాలు చాలా ఒత్తిడితో, నాటకీయంగా జరుగుతాయి . వంద అబద్దాలు చెప్పైనా ఒక పెళ్లి చేయాలనేవారు పెద్దవాళ్ళు. వరుడి కుటుంబానికి వసతి కల్పించడం నుండి ప్రతి ఒక్కరిని గౌరవించి , అతిధి మర్యాదలు అందించి వివాహాన్ని వైభవంగా చేస్తారు అమ్మాయితరపువారు . సాధ్యమయ్యే అన్ని ఇప్పందులను ఎదుర్కొంటూ వస్తారు. అయితే చైనా లో ఒక పెళ్ళిలో వింతైన ఘటన చోటుచేసుకుంది. ఇటీవల ఒక చైనీస్యువకుడి పెళ్ళిలో తన మాజీ ప్రియురాళ్ళు చేసిన హంగామా ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయ్యింది. ఈ యువకుడి వివాహం లో నిరసన బ్యానర్ ను పట్టుకుని వరుడికి వ్యతిరేకంగా నిరసన చేయడంతో హెడ్ లైన్స్ లో నిలిచాడు.

మాజీ గర్ల్‌ఫ్రెండ్‌లు వరుడు మహిళల పట్ల ప్రవర్తించినందుకు నిరసనగా “నాశనం” చేస్తామని బ్యానర్ పట్టుకుని బెదిరించారు. మేము చెన్ మాజీ ప్రియురాళ్ల మని , ఈ రోజు నిన్ను నాశనం చేస్తాం” అని రాసి ఉన్న భారీ బ్యానర్‌ను పట్టుకుని పెళ్లి మండపం వద్ద ప్రదర్శించారు.

నైరుతి చైనాలోని యునాన్ ప్రావిన్స్‌కు చెందిన వ్యక్తి చెన్. చైనీస్ సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో ఈ వీడియో వైరల్ అయ్యింది. పెద్ద ఎరుపు రంగు బ్యానర్‌ను పట్టుకున్న మహిళల సమూహం గా కనిపిస్తున్న ఈ పిక్ లోని వారంతా చెన్ ప్రియురాళ్ళు . వారి బహిరంగ నిరసన వివాహానికి వచ్చిన అతిథుల ఆకర్షించింది.

ఏఏ నిరసన పైన చెన్ స్పందించాడు. ఇది నన్ను చాలా ఇబ్బంది పెట్టింది, ఇప్పుడు కొత్తగా పెళ్లయిన నాకు నా భార్య తో విభేదాలు ఏర్పడ్డాయి. ఈ సంఘటనతో వధువు కుటుంబం ఆగ్రహం గా ఉంది. షాక్‌కు గురైందని చెన్ చెప్పాడు ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే , తన పెళ్లిలో తన మాజీ ప్రియురాళ్ల నిరసనపై తనకు కోపం లేదని చెన్ తెలిపాడు. అతను అపరిపక్వతతో ఉన్నాడని తాను ఓ చెడ్డ బాయ్‌ఫ్రెండ్ అని అంగీకరించాడు.