Charmi : విజయ్ దేవరకొండ కథానాయకుడిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో రూపొందిన మిక్స్‌డ్ మార్షల్ ఆర్ట్స్‌మూవీ ‘లైగర్’. అనన్య పాండే కథానాయికగా నటించింది. ఈ సినిమాను ఛార్మి నిర్మిస్తోంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఆగస్టు 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. పక్కా మాస్, కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా రూపుదిద్దుకొని పాన్ ఇండియా స్థాయిలో ఈ సినిమా విడుదల కానుంది. ఈ క్రమంలోనే ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాల జోరును మరింత పెంచింది చిత్ర యూనిట్. ముంబయిలో గత రెండు వారాలుగా హడావుడి చేస్తున్న యూనిట్ సభ్యులు ఇప్పుడు తెలుగు మీడియా ముందుకు వచ్చారు.
‘లైగర్’ ప్రమోషన్స్ కోసం విజయ్, అనన్య ఎక్కడికి వెళ్లినా ప్రేక్షకాదరణ ఓ రేంజ్‌లో లభిస్తోంది. పుణె, పట్నా, వడోదర, చండీగఢ్.. ఇలా ప్రతి చోటా నిర్వహించిన ప్రమోషనల్ ఈవెంట్స్‌లో షాపింగ్ మాల్స్, గ్రౌండ్స్ నిండిపోతున్నాయి. రాత్రి తొమ్మిది గంటలకు ప్రోగ్రామ్ అని ప్రకటించినా కూడా జనసందోహం తగ్గడం లేదు. కొన్ని సార్లు అయితే జనాన్ని కంట్రోల్ చేయలేక ప్రోగ్రామ్‌ను సైతం క్యాన్సిల్ చేయాల్సిన పరిస్థితి వస్తోంది. విజయ్‌కున్న క్రేజ్, ప్రేక్షకుల నుంచి వస్తోన్న రెస్పాన్స్ చూసి సినిమాపై అంచనాలు ఓ రేంజ్‌లో పెరుగుతున్నాయి. విజయ్ నటించిన ‘అర్జున్ రెడ్డి’ని ఉత్తరాది వాళ్లూ చూడటంతో అతనికి అక్కడ ఫ్యాన్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది.
Charmi : ఓటీటీకి ఎందుకు ఇవ్వలేదు?
ఇక చిత్ర యూనిట్ ప్రస్తుతం తెలుగు మీడియాలో ఇంటర్వ్యూలతో తెగ హడావిడి చేస్తోంది. తాజాగా తెలుగు ప్రేక్షకుల కోసం హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పూరితో పాటు నిర్మాతల్లో ఒకరైన ఛార్మి ఇంటర్వ్యూ చేసింది. ఇక ఛార్మి ఇంటర్వ్యూ చేస్తోందంటే దానికి ఏ రేంజ్‌లో హైప్ ఉంటుందో చెప్పనక్కర్లేదు. దీనికోసం జనం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. తాజాగా ఈ ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఓటీటీ నుంచి బిగ్ ఆఫర్ వచ్చిన సమయంలో అంటూ ఛార్మి కన్నీరు పెట్టుకుంది. ఓటీటీకి ఎందుకు ఇవ్వలేదు అనేది ప్రస్తుతం సస్పెన్స్‌గా మారింది. ఇక ఈ ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ సైతం ఎప్పుడూ లేనిది ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకున్నారు. వీరిద్దరూ ఎందుకు కన్నీళ్లు పెట్టుకున్నారో తెలియాలంటే 19 వరకూ ఆగాల్సిందే. ఈ ఇంటర్వ్యూ ఈ నెల 19న స్ట్రీమింగ్ కానుంది.