Charmme Kaur : మూడేళ్లుగా కన్న కళలన్నీ ఒక్కసారిగా మటాష్ అయ్యాయి. ఈసారైనా హిట్ కొడితే సెటిలైపోదామనుకున్నారు. భారీ అంచనాలతో భారీ బడ్జెట్ తో లైగర్ సినిమాను సెట్స్ మీదకు తీసుకొచ్చారు. దేశవ్యాప్తంగా భారీగానే ఖర్చుపెట్టి ప్రమోషన్లు చేశారు. తీరా సినిమా విడుదల కాగానే పెద్ద డిజాస్టర్ గా మిగిలి ప్రొడ్యూసర్లకు కోలుకోలేని దెబ్బ తీసింది . అటు విజయ్ స్టార్ డమ్ కి కూడా భారీగానే డామేజ్ అయింది. కథ హిట్ కాకపోవడంతో పూరి కూడా సైలెంట్ అయ్యాడు. అసలు కష్టమంతా వచ్చిందల్లా ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్లకే. లైగర్ సినిమాతో భారీగా నష్టపోయామంటూ గగోలు పెడుతున్నారు డిస్ట్రిబ్యూటర్లు. ఇదే సమయంలో ఛార్మి సోషల్ మీడియా నుంచి తప్పుకోవడం సినిమా ఫ్లాపుకు సంబంధించి ఎలాంటి కామెంట్లు చేయకపోవడంతో ఈ టాపిక్ కాంట్రవర్సీగా మారిపోయింది. అసలే తీవ్ర దుఃఖంలో ఉన్న డిస్ట్రిబ్యూటర్లు ఎలాగైనా.. ఛార్మి, పూరీలు ఇద్దరు కలిసి తమ నష్టాలను కాస్త పూడ్చమని రిక్వెస్ట్ చేసేందుకు ప్రయత్నిస్తున్నారట. ఇదే సమయంలో ఛార్మి దీనికి ఓ ఆసక్తికరమైన కామెంట్ చేసింది. నా దగ్గర ఇవ్వడానికి ఇంకేం మిగలలేదంటూ తేల్చి చెప్పేసింది.
Charmme Kaur : చార్మి కౌర్ ఈ కామెంట్ తో డిస్ట్రిబ్యూటర్లు అంతా ఒక్కసారిగా అవ్వక్కయ్యారట. ఇదే సందర్భంలో మేం కూడా చాలా లాస్ అయ్యామని మా దగ్గరే డబ్బులు లేకపోతే మీకు ఎక్కడి నుంచి తీసుకురావాలని చెప్పుకొస్తోందట ఛార్మి. అసలు డిస్ట్రిబ్యూటర్లకు మాట్లాడే అవకాశం ఇవ్వట్లేదట. ఫోన్లో కూడా అందుబాటులో లేకపోవడంతో ఆందోళనలో పడిపోయారు వీరంతా. ఈ టాపిక్ ని ఎలాగైనా ఫిల్మ్ ఛాంబర్ వరకు తీసుకెళ్లాలని ఆలోచన చేస్తున్నారట. తమ డబ్బులు రాబట్టుకునేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్లు ఇండస్ట్రీ టాక్. అయితే చార్మి కౌర్ ఇలా తెగేసి చెప్పడంతో ఎవరితో మాట్లాడినా ఏం ప్రయోజనం ఉంటుందన్న అభిప్రాయానికి వస్తున్నారట.
Charmme Kaur : నిజానికి ఈ మధ్యకాలంలో భారీ బడ్జెట్ తో రిలీజ్ అయ్యే పాన్ ఇండియా సినిమాలన్నీ కూడా బాక్స్ ఆఫీస్ వద్ద బోల్తా పడుతున్నాయి. నేషనల్ వైడ్ గా ప్రమోషన్లు ఊదరగొడుతున్న కనీసం కలెక్షన్స్ రాక ప్రొడ్యూసర్లు, డిస్ట్రిబ్యూటర్లు లాస్ట్ లో కూరుకుపోతున్నారు. ప్రభాస్ సినిమా కూడా ఇలాంటి కష్టాలనే ఎదుర్కొంది. బాహుబలి తో ప్రపంచవ్యాప్తంగా మంచి క్రేజ్ ను సంపాదించుకున్న ప్రభాస్ అదే క్రేజ్ కంటిన్యూ అవుతుందని భావించాడు. కానీ రాధే శ్యామ్ దానికి బ్రేక్ వేసింది. సినిమా డిజాస్టర్ ను మిగిల్చడంతో ప్రొడ్యూసర్లు భారీగా లాస్ అయ్యారు. డిస్ట్రిబ్యూటర్ల పరిస్థితి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. లేటెస్ట్ గా విడుదలైన బ్రహ్మాస్త్ర ది కూడా అదే పరిస్థితి. దీన్నిబట్టి ఒక విషయం అయితే గట్టిగా చెప్పవచ్చు. ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారని. పాన్ ఇండియా లెవెల్ లో వందల కోట్ల సినిమాల కన్నా.. గల్లీల్లో తీసే షార్ట్ ఫిలిమ్స్ ఇప్పుడు భారీ వసూలను రాబడుతున్నాయి. డైరెక్టర్లు, ప్రొడ్యూసర్లు ఇప్పటికైనా తమ ఆలోచన ధోరణి మార్చుకుని కొత్త కాన్సెప్ట్ తో సినిమాలు తీయాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.