Charmi Kaur: పూరి జగన్నాథ్,విజయ్ దేవరకొండ కాంబినేషన్లో బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కిన మొట్టమొదటి పాన్ ఇండియా చిత్రం లైగర్. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఆగస్టు 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.అయితే ఎన్నో అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఫస్ట్ షో తోనే డిజాస్టర్ టాక్ సొంతం చేసుకుంది.ఈ సినిమాలో ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ఉన్నప్పటికీ సినిమాలు కంటెంట్ లేకపోతే ఎలాంటి సినిమాని ప్రేక్షకులు ఆదరించరని మరోసారి రుజువు చేసింది.
ఇకపోతే ఈ సినిమాపై ఎన్నో ఆశలు పెట్టుకున్న పూరి జగన్నాథ్ చార్మిలకు తీవ్ర నిరాశ మిగిలింది. ఈ సినిమా ఎన్నో నష్టాలను తీసుకురావడంతో డిస్ట్రిబ్యూటర్లు పెద్ద ఎత్తున తమ డబ్బును వెనక్కి ఇవ్వాలని ఆందోళన చేస్తున్నారు. ఇకపోతే తాజాగా ఛార్మి ఆదివారం ట్విట్టర్ వేదికగా ఒక ట్వీట్ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోని ఈమె ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ.. తాను సోషల్ మీడియాకు కాస్త బ్రేక్ ఇస్తున్నానని తెలియజేశారు.
ఈ సందర్భంగా ఈమె ట్వీట్ చేస్తూ… చిల్ గాయ్స్ కాస్తా బ్రేక్ తీసుకుంటున్నా. పూరీ కనెక్ట్స్ త్వరలోనే మరింత దృఢంగా, మునుపటికి కంటే ఉత్తమంగా తిరిగి వస్తుంది. అప్పటివరకు కాస్తా శాంతించండి అంటూ ట్వీట్ చేశారు. ఈ విధంగా లైగర్ సినిమా డిజాస్టర్ కావడంతో చార్మి భారీ నష్టాలను ఎదుర్కోవడమే కాకుండా ఏకంగా సోషల్ మీడియాకు కూడా దూరమవుతున్నట్లు పేర్కొన్నారు.
Charmi Kaur: నెటిజన్ల దెబ్బకు సోషల్ మీడియాకు దూరమైన ఛార్మి
ఇదిలా ఉండగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ దేవరకొండ ఛార్మి పూరి జగన్నాథ్ అతిగా ప్రమోషన్స్ చేశారు. ఇలా అతి ప్రమోషన్స్ వీరిని ఎన్నో ఇబ్బందులకు గురి చేసిందని చెప్పాలి.సినిమాలో కంటెంట్ లేకుండా ప్రమోషన్ కార్యక్రమాలను ఎంతో అతిగా చేసినప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు రారు అంటూ పెద్ద ఎత్తున నెటిజన్లు కామెంట్లు చేశారు.ఇలా సోషల్ మీడియా వేదికగా వీరిని పెద్ద ఎత్తున ట్రోల్ చేయడంతో చార్మి ఈ విధమైనటువంటి నిర్ణయం తీసుకొని కొన్ని రోజులపాటు సోషల్ మీడియాకి బ్రేక్ ఇస్తున్నట్లు పేర్కొన్నారు