Charmi Kaur: ఛార్మి కౌర్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం వెండితెరకు దూరమైనప్పటికీ తెర వెనుక సినిమాని నడిపిస్తున్నారు. ఈమె పూరి జగన్నాథ్ తో కలిసి పూరి కనెక్ట్స్ బ్యానర్ ను స్థాపించి పూరీ జగన్నాథ్ తో కలిసి సినిమాలు నిర్మిస్తూ బిజీగా ఉన్నారు. ఇలా పూరి జగన్నాథ్ తో కలిసి పలు సినిమాలు చేసిన ఈమె తాజాగా లైగర్ సినిమా నిర్మాణంలో కూడా భాగస్వామ్యం అయ్యారు.
ఇక ఈ సినిమా విడుదలకు ముందు సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. అయితే ఈ సినిమా ఊహించని దానిలో పావు వంతు కూడా లేకపోవడంతో ప్రేక్షకులు ఎంతో నిరాశకు గురయ్యారు.ఇక ఈ సినిమా భారీ డిజాస్టర్ కావడం చేత చార్మి పూరి జగన్నాథ్ పెద్ద ఎత్తున నష్టాలను ఎదుర్కొన్నారని తెలుస్తోంది.ఇక పూరి జగన్నాథ్ కు భారీ నష్టాలు రావడం చేత ఈయన ముంబైలో అద్దెకు తీసుకున్నటువంటి ఫ్లాట్ కాళీ చేయబోతున్నారట రెండు రోజులుగా సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.
పూరి జగన్నాథ్ నివసించేటటువంటి ఈ ఫ్లాట్ కోసం నెలకు 10 లక్షల రూపాయల అద్దె చెల్లించాల్సి ఉంటుంది.ప్రస్తుతం ఉన్న పరిస్థితులలో పూరి జగన్నాథ్ అంత చెల్లించలేకపోవటం వల్లే ఈయన ఏకంగా తన ఫ్లాట్ కాళీ చేసే హైదరాబాద్ తిరిగి రానున్నట్లు వార్తలు వస్తున్నాయి.ఇలా పూరి జగన్నాథ్ గురించి వచ్చినటువంటి ఈ వార్తలపై చార్మి ట్విట్టర్ వేదికగా స్పందించారు.
Charmi Kaur: అవన్నీ అవస్తవాలే..
ఈ సందర్భంగా చార్మి ట్వీట్ చేస్తూ రూమర్స్.. రూమర్స్..రూమర్స్ అన్ని అబద్ధమే పూరి జగన్నాథ్ ఫ్లాట్ కాళీ చేస్తున్నారని వార్తలు పై ఏమాత్రం నిజం లేదని ఈమె క్లారిటీ ఇస్తూ ఇలాంటి రూమర్లకు శాంతి కలగాలంటూ పోస్ట్ చేశారు. ఇలా చార్మి ట్విట్టర్ ద్వారా ట్వీట్ చేస్తూ పూరి జగన్నాథ్ గురించి పూరి కనెక్ట్స్ గురించి వచ్చే వార్తలలో ఏమాత్రం నిజం లేదని పూర్తిగా ఖండించారు. ప్రస్తుతం ఈమె చేసిన ఈ ట్వీట్ వైరల్ అవుతుంది.