మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి ఈ ఏడాది అంత మంచి శకునాలే ఉన్నాయి. నిర్మాతగా గాడ్ ఫాదర్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. అలాగే ఆర్ఆర్ఆర్ సినిమాలో అల్లూరి పాత్రతో వరల్డ్ వైడ్ గా ఫేమస్ అయిపోయాడు. ఇక ఈ సినిమా ఇప్పుడు గోల్డెన్ గ్లోబ్ అవార్డులకి నామినేట్ అయ్యింది. మరో వైపు పెళ్ళైన పదేళ్ళ తర్వాత రామ్ చరణ్, ఉపాసన దంపతులు పేరెంట్స్ కాబోతున్నారు. ఇక రీసెంట్ గా నేషనల్ వైడ్ గా ఐకానిక్ అవార్డుని కూడా అందుకున్నాడు. ఇదిలా ఉంటే ఇప్పుడు మరో మరుధైన గౌరవాన్ని మెగా హీరో సొంతం చేసుకోబోతున్నాడు. ప్రధాని నరేంద్ర మోడీ, ఇండియన్ రిచెస్ట్ మెన్ ముఖేష్ అంబానీ పాల్గొనే కార్యక్రమంలో వారితో పాటు వేదిక పంచుకొబోతున్నాడు.
అహ్మదాబాద్ లో స్వామీ మహారాజ్ జన్మ శతాబ్ది ఉత్సవాలు జరగబోతున్నాయి. ఈ ఉత్సవాలలో ప్రధాని నరేంద్ర మోడీ, ముఖేష్ అంబానీ కూడా ముఖ్య అతిథులుగా పాల్గొనబోతున్నారు. వీరితో పాటు సౌత్ ఇండియా నుంచి రామ్ చరణ్ కి ప్రత్యేక ఆహ్వానం అందింది. స్వామీజీ అనుచరులు తాజాగా రామ్ చరణ్ ని కలిసి ఆహ్వాన పత్రం అందించారు. ఇక చెర్రి కూడా ఈ వేడుకలో పాల్గొనడానికి వెళ్ళబోతూన్నాడు. ఇలా దేశంలో ప్రముఖ వ్యక్తులతో పాటు ఒకే వేదికని పంచుకునే అవకాశం రావడం నిజంగా గొప్ప విషయం అని చెప్పాలి.
ఇప్పటికే రామ్ చరణ్ ఇమేజ్ పరంగా మెగాస్టార్ ని సైతం మించిపోయి ఇండియన్ వైడ్ గా పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. బుచ్చిబాబు సానా దర్శకత్వంలో చేయబోతున్న సినిమా కూడా పాన్ ఇండియా లెవల్ లోనే తెరకెక్కనుంది. దాంతో పాటు సౌత్ ఇండియా దిగ్గజ దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మూవీని ఇప్పటికే కంప్లీట్ చేశాడు. ఇలా వరుస పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో రామ్ చరణ్ ఇమేజ్ అమాంతం పెరిగిపోయింది. ఈ నేపధ్యంలో చిత్ర పరిశ్రమ నుంచి స్వామీ మహారాజ్ జన్మ శతాబ్ది ఉత్సవాలలో పాల్గొనే గౌరవం రామ్ చరణ్ కి దక్కిందని చెప్పాలి.