Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు నాలుగో వారం కూడా పూర్తి కావొచ్చింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ విషయంలో కూడా క్లారిటీ వచ్చింది కానీ ఒక విషయంలో మాత్రం క్లారిటీ రావడం లేదు. అదేనండి.. చలాకీ చంటి, గలాటా గీతూ యవ్వారం. వామ్మో వీళ్లిద్దరినీ టామ్ అండ్ జెర్రీ అందమా? వాటి మధ్య రైవలరీ చాలా ఫన్నీగా అనిపిస్తుంది. జింక – పులి అందామా? ఇద్దరూ అయితే జింక లేదంటే పులులు. ఈ సమ ఉజ్జీలను ఎవ్వరితోనూ పోల్చలేం. ఇద్దరూ ఇద్దరే.
అవకాశం దొరికిందంటే చాలు.. బిగ్‌బాస్ హౌస్‌లో సెగలు పుట్టిస్తున్నారు. వీళ్లిద్దరిలో తప్పెవరి అని తేలుద్దామా? అంటే అదీ కుదరడం లేదు. ఇద్దరూ ఇద్దరే. నామినేషన్స్‌లోనూ ఒకరినొకరు నామినేట్ చేసుకుంటారు.. అలాగే కెప్టెన్సీ టాస్క్‌లోనూ ఒకరంటే ఒకరికి పడదు. చివరికి హోస్ట్ నాగార్జున దగ్గర కూడా వీరిద్దరూ ఒకరిపై మరొకరు చురకలేసుకున్నారు. వీళ్లిద్దరి మ్యాటర్‌లో ఎవ్వరినీ తప్పు బట్టలేం. అయితే చంటి మాత్రం అది.. ఇది అంటూ గీతూ గురించి మాట్లాడటం అతనిపై నెగిటివిటీ పెరిగే అవకాశం ఉంది.
Bigg boss 6 : మోస్ట్ టాక్సిక్.. మోస్ట్ కన్నింగ్.. మోస్ట్ మ్యానిప్యులేటర్..
ఇక ఇవాళ నైట్ షోకి సంబంధించిన ప్రోమోను స్టార్ మా విడుదల చేసింది. దీనిలో హోస్ట్ నాగార్జున బీబీ ఛాట్ భాండార్ అనే గేమ్‌ను ఆడించారు. దీనిలో ఉప్పుతో నింపిన పానీపూరిని గీతూకి చంటి అందించాడు. ఏంటి సర్ ఇది ఉప్పు అంటే నన్ను అడుగుతావే.. చంటిని అడుగు అని నాగ్ అన్నారు. తనకు ఇవ్వవలిసింది తాను ఇచ్చేస్తానని గీతూ చెప్పుకొచ్చింది. ఇక చంటిని.. మోస్ట్ టాక్సిక్.. మోస్ట్ కన్నింగ్.. మోస్ట్ మ్యానిప్యులేట్‌గా అనిపిస్తాడని చంటి గురించి చెప్పి పానీపూరి తినిపించింది. మొత్తానికి వీరిద్దరి రైవలరీ ఇప్పట్లో తగ్గేలా అనిపించడం లేదు. ఇది చూస్తుంటే.. ఇన్ని టాక్సిక్, కన్నింగ్, మ్యానిప్యులేటర్ అంటూ బిరుదులు ఇచ్చాక చంటి ఆగుతాడా? నెక్ట్స్ నామినేషన్స్‌లో వీరిద్దరికీ మళ్లీ గట్టిగానే పడటం ఖాయం.