unstoppable 2 : నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా వచ్చిన ‘అన్‌స్టాపబుల్’ షో సీజన్ 1 పూర్తి చేసుకుని సీజన్ 2లోకి అడుగు పెట్టింది. ఇక సీజన్ 2కి తొలి గెస్ట్‌గా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు హాజరయ్యారు. మధ్యలో ఆయన తనయుడు నారా లోకేష్ కూడా వచ్చి జాయిన్ అయ్యారు. ఇక ఈ షో ఆద్యంతం చాలా ఫన్నీగా నడిచింది.మధ్యలో చంద్రబాబు కొంత ఎమోషనల్ కూడా అయ్యారు. తన జీవితంలో తీసుకున్న అతిపెద్ద నిర్ణయం గురించి చెబుతూ అసలు అది ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో వివరిస్తూ కొంత ఎమోషనల్ అయ్యారు.
ఇక చంద్రబాబు తన భార్యను ఏమని పిలుస్తారు? ఆమెకు లైవ్‌లో ఐలవ్ యూ చెప్పాలనడం అంతా ఫన్నీగా సాగింది. ‘ఏమని పిలుస్తావు బావ మా చెల్లిని’ అని బాలయ్య అడిగారు. దీనికి చంద్రబాబు ‘భూ’అని పిలుస్తానని వెల్లడించారు. షో సాక్షిగా.. అందరి సాక్షిగా.. తన చెల్లికి ‘ఐ లవ్ యూ’ చెప్పాలని బాలయ్య చెప్పారు. దీనికి చంద్రబాబు తన భార్య భువనేశ్వరికి కాల్ చేసి.. ‘బాలకృష్ణ గారి చేతుల్లో నేను ఇవాళ ఇరుక్కుపోయాను’ అని భువనేశ్వరికి కాల్ చేసి చెప్పారు. ప్రోమో అంతటితో కట్ చేశారు కానీ ‘ఐ లవ్ యూ’ చెప్పారనే తెలుస్తోంది.
ఇక తన బెస్ట్ ఫ్రెండ్ రాజశేఖర్ రెడ్డి అని.. ఆయనతో కలిసి చేసిన చిలిపి పనులు ఈ షోలో చంద్రబాబు వెల్లడించారు. తను వంట చేయడం గురించి.. ఇంకా ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇక తన కాలేజ్ డేస్‌లో చేసిన రొమాంటిక్ పనుల గురించి కూడా చంద్రబాబు వెల్లడించారు. బాలయ్య సినిమాల్లో చేస్తారని..తాను తన కాలేజ్ డేస్‌లో చాలా రొమాంటిక్ పనులు చేశానని చంద్రబాబు చెప్పుకొచ్చారు.నిజానికి చంద్రబాబు ఇప్పటి వరకూ చూసింది ఒక లెక్క.. ఇప్పుడు అంటే ఈ షోలో చూసింది ఒక లెక్క అన్నట్టుగా ఉంది.