యువశక్తి వేదిగా రణస్థలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పొత్తులపై క్లారిటీ ఇవ్వడంతో పాటు వైసీపీ అరాచక పాలనపై విమర్శలు చేశారు. అలాగే జగన్ రెడ్డిపైన కూడా నేరుగా విమర్శలు గుప్పించారు. ముఖ్యంగా తనని పదే పదే ప్యాకేజీ స్టార్, దత్తపుత్రుడు, పార్ట్ టైం పొలిటీషియన్, నిలకడ లేని రాజకీయ నాయకుడు అంటూ వైసీపీ నేతలు విమర్శలు చేస్తూ ఉంటారు. అలాగే మూడు పెళ్ళిళ్ళ గురించి పదే పదే మాట్లాడుతూ ఉంటారు. ఇక యువశక్తి వేదిగా పవన్ కళ్యాణ్ ఈ విమర్శలకి కౌంటర్ గా ప్రతి విమర్శలు చేశారు. అలాగే రోజా చేసిన విమర్శలపై గట్టిగా కౌంటర్ ఇచ్చారు. యుట్యూబ్ స్టార్ రోజా కూడా నా మీద విమర్శలు చేస్తుందని, అసలు రెండు చోట్ల ఓడిపోయానని తనతో కూడా అనిపించుకోవాల్సి వస్తుందని అన్నారు.
అలాగే ఐటీ మంత్రి అమర్ నాథ్ పేరు ఉచ్చరించడానికి కూడా పవన్ కళ్యాణ్ ఇష్టపడకపోవడం విశేషం. ఇక చంద్రబాబుని కలిసిన సమయంలో తాను రెండున్నర గంటలు ఏం మాట్లాడాను చెప్పాలని వైసీపీ నేతలు అడుగుతున్నారని, ఏం మాట్లాడానో చెబుతాను అంటూ వివరించి చెప్పారు. ఇక పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలకి వైసీపీ నేతలు యధావిధిగా ప్రతి విమర్శలు స్టార్ట్ చేశారు. ఒకరి తర్వాత ఒకరు ప్రెస్ మీట్ లు పెట్టి ఒకే టాపిక్ ని అందరూ తమశైలిలో చెప్పుకొచ్చారు. ఇక దాడిశెట్టి రాజా మరో అడుగు ముందుకి వేసి పవన్ కళ్యాణ్ 1800 కోట్లు హవాలా చేస్తూ పోలెండ్ లో దొరికిపోయాడంటూ కొత్త విమర్శలు స్టార్ట్ చేశారు.
ఇదిలా ఉంటే యువశక్తి వేదిగా పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యలపై టీడీపీ అధినేత చంద్రబాబు రియాక్ట్ అయ్యారు. పవన్ కళ్యాణ్ అన్ని నిజాలే చెప్పారని అన్నారు. అలాగే అతను చేసిన విమర్శలకి వైసీపీ నేతలు ఎవరూ సమాధానాలు చెప్పకుండా ప్రతిదాడి చేస్తున్నారని దయ్యబట్టారు. కేవలం భయంతోనే వైసీపీ నాయకులు పవన్ పై విమర్శలు చేస్తున్నట్లు కనిపిస్తుందని అన్నారు. పవన్ తన అభిప్రాయాన్ని చాలా క్లియర్ గా చెప్పారని, వచ్చే ఎన్నికలలో వైసీపీకి ఓటమి భయం మొదలైందని చంద్రబాబు విమర్శలు చేశారు. ఎన్ని నాటకాలు ఆడినా ప్రజలు కచ్చితంగా మిమ్మల్ని ఇంటికి పంపిస్తారు అంటూ కామెంట్స్ చేశారు.