Chandrababu – Prabhas: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈశ్వర్ సినిమాతో తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. ఆ తరువాత పలు సినిమాలలో నటించి మంచి స్టార్ హోదాను సొంతం చేసుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో బాహుబలి సినిమాలో నటించగా ఈ సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు. ఇక ఇదంతా పక్కన పెడితే.. ప్రభాస్ పెద్దనాన్న కృష్ణంరాజు అని అందరికీ తెలిసిందే. తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ఒక గుర్తింపును సొంతం చేసుకున్న హీరో కృష్ణంరాజు.
తన పెద్దనాన్న కృష్ణంరాజుతో కూడా కలిసి నటించాడు ప్రభాస్. ఇక వీరి మధ్య మంచి బంధం ఉండేది. నిజానికి సొంత తండ్రి కొడుకులా ఉండేవారు. కానీ ప్రభాస్ తన తండ్రినే కాదు ఈ రోజు తన పెద్దనాన్న ను కూడా పోగొట్టుకున్నాడు. ప్రభాస్ పెద్దనాన్న నిన్న అనగా ఆదివారం నాడు కన్నుమూశారు. దీంతో కృష్ణంరాజు గారికి నివాళులు అర్పించడానికి చాలామంది ప్రముఖులు, రాజకీయ సినీ రంగానికి చెందినవారు వచ్చారు. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కృష్ణంరాజు భౌతికకాయాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. నివాళులు అర్పించి వెళ్ళిపోతున్నా చంద్రబాబు నాయుడు మళ్లీ వెనక్కి వచ్చి కృష్ణంరాజు గారి భార్యను కూడా పరామర్శించారు.

Chandrababu – Prabhas: రెబల్ స్టార్ ప్రభాస్ తో చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే..
అలా పరామర్శించిన తర్వాత చంద్రబాబు నాయుడు గ అక్కడే కొంతసేపు కూర్చొని ప్రభాస్ తో మాట్లాడిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ప్రభాస్ తో చంద్రబాబు నాయుడు గారు ఏం మాట్లాడారు? వెళ్ళిపోతున్న ఆయన మళ్లీ వెనక్కి వచ్చి అక్కడే అంతసేపు ఎందుకు కూర్చున్నారు? ఈ ప్రశ్నలు సోషల్ మీడియాలో చర్చకు దారితీస్తున్నాయి. కృష్ణం రాజుగారు చనిపోయే ముందు వరకు భారతీయ జనతా పార్టీ లో పనిచేశారు. అందుకే ఆ పార్టీ వాళ్లు చాలామంది వచ్చి నివాళులు అర్పించారు.
ఇక ప్రభాస్, చంద్రబాబుల మధ్య జరిగిన మాటల సంభాషణ ఏమై ఉంటుందని అందరూ అనుమానం వ్యక్తం చేస్తున్నారు. విషాదం చోటు చేసుకున్న ఇంట్లో రాజకీయాలు మాట్లాడకూడదు కదా అని కూడా కొంతమంది కామెంట్లు చేస్తున్నారు. ప్రభాస్ కూడా తన పెద్దనాన్న పనిచేసిన భారతీయ జనతా పార్టీకే మద్దతు ఇస్తాడని బీజేపీ నాయకులు ఎక్కువగా వచ్చి నివాళులు ఇవ్వడానికి వచ్చారని టాక్ కూడా ఉంది.