Chandrababu: ఎన్టీయేలో టీడీపీ చేరబోతుందంటూ నేషనల్ మీడియాలో వార్తలు గుప్పుమంటున్నాయి. బీజేపీ మౌత్ పీస్ గా చెప్పుకునే రిపబ్లిక్ టీవీ కూడా ఎన్టీయేలో టీడీపీ చేరబోతుందని వార్తలు ప్రసారం చేసింది. అంతేకాదు ముహూర్తం కూడా ఫిక్స్ చేసేసింది. దసరా లేదా దీపావళి తర్వాత చేరుతుందని చెప్పేసింది. తెలంగాణలో అధికారంలోకి రావాలన్న బీజేపీకి టీడీపీతో పొత్తు కలిసిసొస్తుందని, అందుకే బాబుతో మళ్లీ పొత్తుకు బీజేపీ సై అంటుందని నేషనల్ మీడియా కోడై కూస్తోంది. ఇక వచ్చే ఎన్నికల్లో నార్త్ లో కొన్నిచోట్ల బీజేపీకి ఎంపీ సీట్లు తగ్గే అవకాశముందని, ఏపీలో కూడా లోక్ సభ సీట్ల పరంగా బీజేపీకి కలిసొచ్చే అవకాశముందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
అయితే ఎన్డీయేల టీడీపీలో చేరబోతుందనే వార్తలపై బీజేపీ రాజ్యసభ ఎంపీ కే.లక్ష్మణ్ స్పందించారు. టీడీపీతో పొత్తుపై ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని, వచ్చే ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామని చెప్పుకొచ్చారు. లక్ష్మణ్ అత్యున్నత బీజేపీ పార్లమెంటరీ బోర్డులో కూడా మెంబర్ గా ఉన్నారు. టీడీపీతో పొత్తు ఉంటే ఆయనకు తెలిసే అవకాశాలు ఉంటాయి. కానీ టీడీపీతో పొత్తుపై తనకు ఎలాంటి సమాచారం లేదని ఆయన చెప్పడం గమనార్హం. ఒంటరిగానే కేసీఆర్ ను ఎదర్కొంటామని ప్రకటించారు.
ఈ క్రమంలో ఎన్డీయేలో చేరడంపై చంద్రబాబు స్పందించారు. ప్రచారం చేసే వాళ్లే దానికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రయోజనాల కోసం తాము ఎన్డీయే నుంచి బయటకు వచ్చామని, రాష్ట్ర ప్రయోజనాల రూపంలో కేంద్ర రాజకీయాలను చూస్తామన్నారు. అయితే తెలంగాణ ఎన్నికల తర్వాత బీజేపీ, టీడీపీ పొత్తుపై నిర్ణయం తీసుకునే అవకాలున్నాయి. తెలంగాణలో వచ్చే ఫలితాలను బట్టి టీడీపీతో పొత్తుపై బీజేపీ నిర్ణయం తీసుకుంటుందని చెబుతున్నారు.నితీష్ కుమార్ ఎన్డీయే కూటమి నుంచి బయటకు వెళ్లడంతో దానిని డైవర్ట్ చేసేందుకే జాతీయ మీడియాలో బీజేపీ ఇలా వార్తలు ప్రసారం చేయించిందనే టాక్ జోరుగా జరుగుతోంది.