Chandrababu : గత వర్షాకాల అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఏపీ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు సంచలన శపథం చేసిన విషయం తెలిసిందే. వైసీపీ ప్రభుత్వం తాను ఇక అసెంబ్లీలోకి అడుగుపెట్టనంటూ సంచలన ప్రకటన చేసి అసెంబ్లీ నుంచి బయటికి వెళ్లారు. తన భార్య భువనేశ్వరిని కించపరుస్తూ వైసీపీ నేతలు కామెంట్లు చేశారనే కారణంతో భావేద్వేగానికి గురైన చంద్రబాబు.. ఈ సెన్సేషనల్ నిర్ణయం తీసుకున్నారు. ఆ తర్వాత ఇటీవల రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి ఎన్నికల సమయంలో ఓటు వేయడానికి మాత్రమే చంద్రబాబు అసెంబ్లీ మెట్లు ఎక్కారు. అంతేకానీ ఇంకెప్పుడూ అసెంబ్లీలో అడుగుపెట్టలేదు. కానీ మళ్లీ చంద్రబాబు అసెంబ్లీ మెట్లు ఎక్కాల్సిన పరిస్థితులను వైసీపీ ప్రభుత్వం కల్పించింది. దీంతో చంద్రబాబు తన శపథాన్ని పక్కన పెట్టి తప్పనసరిగా చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెట్టేలా చేయనున్నారు.
ఈ నెల 15 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ మేరకు ఇప్పటికే గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ నోటిఫికేషన్ జారీ చేశారు. 5 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తోంది. అయితే బిజినెస్ అడ్వర్టైజరీ సమావేశంలో ప్రతిపక్ష పార్టీలతో చర్చించిన తర్వాత అసెంబ్లీ సమావేశాలపై తుది నిర్ణయం తీసుకోనున్నారు. మరో రెండు రోజులు కూడా అసెంబ్లీ సమావేశాలు పొడిగించే అవకాశముంది.
అయితే ఈ సమావేశాల్లో మూడు రాజధానుల బిల్లును ప్రభుత్వం ప్రవేశపెట్టనుందని ప్రచారం సాగుతోంది. మూడు రాజధానుల బిల్లు కోసమే జగన్ అసెంబ్లీ సమావేశాలను నిర్వహించాలని నిర్ణయించినట్లు చెబుతున్నారు. ఒకవేళ అదే జరిగితే చంద్రబాబు అసెంబ్లీకి రాక తప్పనిసరి పరిస్ధితులు ఏర్పడతాయి. ఎందుకంటే చంద్రబాబు హయాంలోనే టీడీపీ ప్రభుత్వాన్ని నమ్మి అమరావతి రైతులు 33 వేల ఎకరాల భూములు ఇచ్చారు. చంద్రబాబు విజన్ ను నమ్మే అన్ని ఎకరాల భూములు ఇచ్చారు. అమరావతిని చంద్రబాబు అభివృద్ధి చేస్తారనే భరోసాతో రైతులు పచ్చని పంటలు పడే భూమిని రాజధాని కోసం త్యాగం చేశారు. అయితే ఇప్పుడు మూడు రాజధానుల బిల్లు ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెడితే దానిని అడ్డుకోవడానికి చంద్రబాబు తప్పనిసరిగా అసెంబ్లీలో అడుగుపెట్టాల్సి ఉంటుంది. లేకపోతే చంద్రబాబుపై విమర్శలు వచ్చే అకవాశముంది.
Chandrababu :
కీలకమైన మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెడుతుంటే అసెంబ్లీలో లేకపోవడం ఏంటని, ఎందుకు అడ్డుకోలేదని ప్రజల్లో వ్యతిరేకత వచ్చే అవకాశముంది. అమరావతి రైతుల తరపున మూడు రాజధానుల బిల్లును అడ్డుకోవాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉంటుంది. అందుకే చంద్రబాబు అసెంబ్లీకి తప్పనిసరిగా హాజరువతారనే చర్చ తెలుగు తమ్ముళ్లలో జరుగుతోది. దీంతో చంద్రబాబు అసెంబ్లీలో హాజరవ్వాలా లేదా అనే దానిపై తెలుగు తమ్ముళ్లు తర్జనభర్జన పడుతున్నారు. గతంలో చంద్రబాబు వేసిన శపథాన్ని గట్టు మీద పెట్టాల్సిందేనా అని టీడీపీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. చంద్రబాబు అసెంబ్లీలోకి అడుగుపెడితే ఇదోక అంశంమే కాకుండా రాష్ట్రంలోని సమస్యలను ప్రస్తావించే అవకాశముంది. అందుకే చంద్రబాబు అసెంబ్లీలోకి వస్తే వాడీవాడీగా సాగే అవకాశముంది.