కార్తికేయ 2 చిత్రంతో ఒక్కసారిగా ఇండియన్ వైడ్ గా దర్శకుడు చందూ మొండేటి పాపులర్ అయిపోయాడు. ఈ సినిమాతో పాన్ ఇండియా దర్శకుల జాబితాలో అతను కూడా చేరిపోయాడు. ఈ నేపధ్యంలో చందూ కూడా తన నెక్స్ట్ సినిమాలు యూనివర్శల్ కాన్సెప్ట్ తో గ్రాండియర్ గా ఆవిష్కరించడానికి ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక కార్తికేయ 2 సక్సెస్ తో ఏకంగా బడా నిర్మాతలు అందరూ కూడా చందూతో సినిమా కోసం అగ్రిమెంట్స్ చేసుకున్నట్లు తెలుస్తుంది. వీరిలో మైత్రీ మూవీ మేకర్స్, గీతా ఆర్ట్స్ వారు ఉండటం విశేషం. ఇక గీతా ఆర్ట్స్ బ్యానర్ లో అయితే అల్లు అర్జున్ హీరోగా చందూ దర్శకత్వంలో పాన్ ఇండియా ప్రాజెక్ట్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు.
మైత్రీ మూవీ కూడా లాగే పాన్ ఇండియా సినిమా ఆలోచనతోనే ఉన్న హీరో ఎవరనేది దర్శకుడి ఇష్టానికి వదిలేసారు. ఇదిలా ఉంటే నార్త్ ఇండియాకి చెందిన ఓ బిగ్ ప్రొడక్షన్ కంపెనీ చందూ మొండేటి కార్తికేయ 2 సినిమాకి ఫిదా అయిపోయి అతనితో సినిమా చేయడానికి ముందుకొచ్చినట్లు తెలుస్తుంది. అయితే ఆ సినిమాని వారు హృతిక్ రోషన్ హీరోగా పెట్టి పాన్ ఇండియా లెవల్ లో అడ్వాంచర్ మూవీ స్క్రిప్ట్ సిద్ధం చేయమని సూచించినట్లు బోగట్టా. హృతిక్ రోషన్ లాంటి స్టార్ హీరోని డీల్ చేసే ఛాన్స్ వస్తే ఏ దర్శకుడు వద్దని అనుకోరు.
ఈ నేపధ్యంలో చందూ కూడా వారికి ఒకే చెప్పినట్లు బిటౌన్ లో వినిపిస్తుంది. ఈ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో టాలీవుడ్ లో కూడా చక్కర్లు కొడుతోంది. త్వరలోనే ఈ సినిమాకి సంబందించిన అఫీషియల్ ఎనౌన్స్ మెంట్ కూడా ఉంటుందని భావిస్తున్నారు. ఇక కార్తికేయ 3 సినిమా కూడా త్వరలో ఎనౌన్సమెంట్ ఉంటుందనే మాటని ఇప్పటికే నిఖిల్ చెప్పకనే చెప్పారు. మరి చందూ నెక్స్ట్ ప్రాజెక్ట్ కార్తికేయ 3 ఉంటుందా లేదా హృతిక్ రోషన్ సినిమా ఉంటుందా అనేది చూడాలి.