Chandigarh University Video Viral: ప్రస్తుతం దేశంలో పంజాబ్ చండీగఢ్ యూనివర్సిటీలో 60 మంది అమ్మాయిల ప్రైవేట్ వీడియోలు లీక్ అయినట్లు వస్తున్న వార్త పెను దుమారం రేపింది. మీడియా ఛానల్స్ అదేవిధంగా సోషల్ మీడియాలో ఈ వార్త బాగా వైరల్ కావడంతో యూనివర్సిటీ విద్యార్థినిలు నిరసనకు దిగారు. దీంతో యూనివర్సిటీలో తీవ్ర దుమారం రేగింది. అయితే వెంటనే ఈ విషయంపై యూనివర్సిటీ యాజమాన్యం స్పందించి మీడియాలో వస్తున్న వార్తలలో వాస్తవం లేదని స్పష్టం చేసింది.
అర్ధరాహితమైన వార్తలు ప్రసారం చేస్తున్నారని చండీగఢ్ యూనివర్సిటీ యాజమాన్యం కొట్టి పారేసింది. యూనివర్సిటీలో ఒక అమ్మాయి తన ప్రైవేటు వీడియో తన బాయ్ ఫ్రెండ్ కి సోషల్ మీడియాలో పంపించడం జరిగింది. అయితే ఆ వీడియో మాత్రమే లీక్ అయిందని యాజమాన్యం స్పష్టం చేసింది. తాము చేపట్టిన ప్రాథమిక విచారణలో… ఆ అమ్మాయి వీడియో తప్ప మరెవరి వీడియోలు లేవని లీక్ కాలేదని యాజమాన్యం విద్యార్థినిలకు వివరణ ఇవ్వటం జరిగింది. మీడియాలో 60 ప్రవేట్ వీడియోలు లీక్ అయినట్లు వస్తున్న వార్తలలో వాస్తవం లేదని యూనివర్సిటీ ప్రో ఛాన్సలర్ డాక్టర్ బవా స్పష్టం చేశారు.
అయితే వస్తున్న వదంతులను ఎవరు నమ్మవద్దని తెలియజేయడం జరిగింది. ఇక ఇదే సమయంలో యూనివర్సిటీలో ఏడుగురు అమ్మాయిలు ఆత్మహత్య చేసుకున్నట్లు జరుగుతున్న ప్రచారంలో కూడా వాస్తవం లేదని క్లారిటీ ఇచ్చారు. అంత మాత్రమే కాదు ఏ విద్యార్థిని కూడా కనీసం ఆసుపత్రిలో కూడా జాయిన్ అవ్వలేదని స్పష్టం చేశారు. బాయ్ ఫ్రెండ్ కి తన ప్రైవేట్ వీడియో లీక్ చేసిన అమ్మాయిని పోలీసులు అరెస్టు చేసినట్లు స్పష్టం చేశారు. ఈ కేసుకు సంబంధించి యాజమాన్యం పూర్తిగా పోలీసులకు సహకరిస్తుందని కూడా తెలిపారు.