Chalapathi Roa : టాలీవుడ్ చిత్ర పరిశ్రమ మహానటులను కోల్పోతుంది. వరుస పెట్టి సీనియర్ నటులందరూ కూడా హఠాన్ మరణం పొందడంతో ఇండస్ట్రీ తీవ్ర విషాదం లో మునిగిపోయింది. మొన్న కృష్ణంరాజు ఆ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ గారు నిన్న కైకాల సత్యనారాయణ గారు సినీ ఇండస్ట్రీని వీడి ఇండస్ట్రీకి తీరని లోటు మిగిలిస్తే ప్రస్తుతం టాలీవుడ్ ప్రముఖ నటుడు తమ్మారెడ్డి చలపతి హఠాన్మరణం పొందారు. హైదరాబాదులోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. తన మరణానికి కారణం గుండె పోటని కుటుంబ సభ్యులు వెల్లడించారు. టాలీవుడ్ చిత్ర పరిశ్రమలోని ప్రముఖులందరూ కూడా ఆయన మరణాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తనదైన విలనిజం, హాస్య చాతుర్యంతో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను నవ్వించారు. ఒక్కసారి అని లేరన్నమాట తెలుసుకుని తీవ్ర విషయంలో మునిగిపోయారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెడుతున్నారు.

చలపతిరావు స్వస్థలం కృష్ణాజిల్లా. 1944లో బల్లిపర్రు లో జన్మించారు. శని రంగంలో ఈయన ఎదుగుదలకు ఎన్టీఆర్ ఎంతగానో సహాయం అందించారు. ఈయన మొట్టమొదటిసారి నటించిన చిత్రం కథానాయకుడు. ఇప్పటివరకు ఆయన ఇండస్ట్రీలో 1500 వరకు సినిమాల్లో నటించారు. దాదాపుగా సీనియర్ నాయకులు అందరితోను ఆయన నటించారు. ప్రతి నాయకుడు పాత్రతో ఇండస్ట్రీలో ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు. సహా సహనటుడుగా చాలా వరకు సినిమాల్లో ఉత్తమమైన నటనతో ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నారు.

కొన్ని సినిమాలకు నిర్మాతగాను వ్యవహరించారు. చలపతిరావుకు కుమారుడు రవిబాబు ఒక కుమార్తె ఉన్నారు. ప్రస్తుతం తన కూతురు అమెరికాలో ఉంటుంది. తాను ఇండియాకు వచ్చిన తర్వాతే చలపతిరావు గారి అంత్యక్రియలు నిర్వహిస్తామని కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. ఆయన అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతిక కాయాన్ని రవిబాబు ఇంట్లోనే ఉంచనున్నారు.