Bigg boss 6 : ఈసారి బిగ్‌బాస్ తెలుగు.. వామ్మో ఆ షో అంటేనే చిరాకు తెప్పించేలా తయారు చేశారు కంటెస్టెంట్స్. నిజానికి బిగ్‌బాస్ షో ప్రారంభానికి ముందు ఆ కంటెస్టెంట్స్.. ఈ కంటెస్టెంట్స్.. ఈ సారి షో అదిరిపోతుంది.. బెదిరిపోతుంది అంటూ టాక్ నడిచింది. ఇప్పుడు చూస్తే.. అదిరిపోవడం మాటేమో కానీ ఒక్కో కంటెస్టెంట్ తీరు చూసి ప్రేక్షకులు నిజంగానే బెదిరిపోతున్నారు. ఒక్కరంటే ఒక్కరికి కూడా మంచి మార్కులు పడటం లేదు. ఇక చెత్తలో నుంచి కాస్త మంచి వారిని ఎంచుకునే బదులు.. సింపథీ యాంగిల్ తీసుకుంటున్నారు ప్రేక్షకులు. ఈ సారి విన్నర్ సింపథి కారణంగానే కాబోతున్నారు.
కంటెస్టెంట్స్ అంతా ఎవరికి వారే యమునా తీరే.. కపుల్ అయిన మెరీనా-రోహిత్‌లు డీసెంట్‌గా ఆటాడుతుంటే.. పులిహోర రాజాలు రెచ్చిపోతున్నారు. ఒకవైపు అర్జున్ కల్యాణ్ తన చేతలతో వెగటు పుట్టిస్తున్నాడు. మరోవైపు ఆరోహి-సూర్య.. వీళ్లు స్క్రీన్‌పై కనిపిస్తే చాలు.. ప్రేక్షకులు రిమోట్‌తో టీవీ ఛానల్ మార్చేసే పరిస్థితి వస్తోంది. ఏదో లవ్ ట్రాక్ కలిసొస్తుందని వీరిద్దరు భావిస్తున్నారో ఏమో కానీ సీన్ రివర్స్ అవుతోంది. ఈ వారం ప్రేక్షకులు వీరిద్దరిలో ఒకరిని బయటకు పంపించడం ఖాయంగా కనిపిస్తోంది. అంతలా చిరాకు తెప్పిస్తే అంతేగా మరి.
Bigg boss 6 : ఇంత చెత్త రికార్డ్ ఏ సీజన్‌లోనూ ఎవరికీ లేదు..
ఇక బిగ్‌బాస్ షోలో సీక్రెట్ టాస్క్ ఎవరికైనా వచ్చిందంటే వారు పండగ చేసుకుంటారు. దాన్ని ఛాలెంజ్‌గా తీసుకుని మరీ ముగిస్తారు. అదొక థ్రిల్లింగ్ టాస్క్. అలాగే ప్రతి ఒక్క కంటెస్టెంట్ సీక్రెట్ టాస్క్ వస్తే బాగుండు అనుకుంటూ ఉంటారు. దీని వల్ల వారి టాలెంట్ బయట పడటమే కాకుండా నేరుగా కెప్టెన్సీకి నామినేట్ అవుతారు. మరి ఇలాంటి ఛాన్స్ మన చలాకీ చంటికి వచ్చింది. ఆయన గారు మాత్రం ఈ టాస్క్‌తో ఈ ఆరు సీజన్లలోకే చెత్త అనిపించుకున్నాడు. కనీసం తనకు ఒక సీక్రెట్ టాస్క్ ఇచ్చారన్న విషయాన్ని కూడా మరిచిపోయాడు. కనీసం దాని గురించి పట్టించుకోను కూడా లేదు. సీక్రెట్ టాస్క్ విషయంలో ఇంత చెత్త రికార్డ్ ఏ సీజన్‌లోనూ ఎవరికీ లేదు. కనీసం ట్రై చేసి ఓడిన వారున్నారు కానీ చంటిలా మాత్రం ఎలాంటి ప్రయత్నమూ చేయకుండా ఉండిపోయినవారెవరూ ఇప్పటి వరకూ లేరు.