Biggboss 6 : ‘‘గెలుపు ఆట మీద ఆసక్తి ఉన్నవాడిని కాదు..ఆటలో ఆశయం ఉన్నవాడిని మాత్రమే గెలిపిస్తుంది. స్నేహాల మధ్య కాస్త పలకరింపులు, పులకరించిపోయే ప్రేమలుంటాయి. స్నేహాలు, ప్రేమలు ఎన్నున్నా.. గెలవాల్సిన చోట నిలబడాల్సినప్పుడు యుద్ధాలు ఉంటాయి. ఓదార్పు దూరమై.. ఒంటరితనం దగ్గరైనప్పుడు ఒడికి చేరిన కన్నీళ్లూ ఉంటాయి. ఎన్ని ఉన్నా ఈ యుద్ధంలో ఆత్మ విశ్వాసమే ఆయుధమైనప్పుడు ప్రశ్నించడానికి, ప్రశంసించడానికి, సమర్ధించడానికి, శాసించడానికి, గెలుపుకి తోడుగా.. ఓటమికి ధైర్యంగా, అందరికీ అండగా.. రాజ్యాన్ని గెలిచే రాజు ఒక్కడుంటాడు. ఇక మొదలెడదామా?’ అనే ఏవీతో నాగ్ ఎంట్రీ బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారు.
కొత్త కంటెస్టెంట్‌లకు స్వాగతం పలికేందుకు హౌస్ సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. ఇప్పటి వరకూ జరిగిన ఐదు సీజన్లతో పాటు ఓటీటీలో వచ్చిన సీజన్ కంటే భిన్నంగా హౌస్‌ను నిర్వాహకులు అరేంజ్ చేశారు.బిగ్‌బాస్ హౌస్‌లోకి తొలి కంటెస్టెంట్‌గా ‘కార్తీక దీపం’ ఫేమ్ కీర్తి అదేనండి.. మన హిమ ఎంట్రీ ఇచ్చింది. ఇక సెకండ్ కంటెస్టెంట్‌గా సుదీప అదేనండి మన పింకీ ఎంట్రీ ఇచ్చింది.మూడవ కంటెస్టెంట్‌గా శ్రీహాన్.. నాలుగవ కంటెస్టెంట్‌గా నేహా శర్మ ఎంట్రీ ఇచ్చింది. ఆ తరువాత బ్రహ్మాస్త్ర సినిమా ప్రమోషన్ కార్యక్రమం కాసేపు కొనసాగింది. హీరోయిన్ ఆలియా ఇంత బాగా పాడుతుందా? అనిపించేలా ఒక పాట పాడింది. ప్రమోషన్స్ అనంతరం ఐదవ కంటెస్టెంట్ పరిచయ కార్యక్రమం జరిగింది.
Biggboss 6 : అదిరిపోయే కమెడియన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు..
బిగ్‌బాస్ హౌస్‌లోకి తొలి కంటెస్టెంట్‌గా ‘కార్తీక దీపం’ ఫేమ్ కీర్తి అదేనండి.. మన హిమ ఎంట్రీ ఇచ్చింది. ఇక సెకండ్ కంటెస్టెంట్‌గా సుదీప అదేనండి మన పింకీ ఎంట్రీ ఇచ్చింది.మూడవ కంటెస్టెంట్‌గా శ్రీహాన్.. నాలుగవ కంటెస్టెంట్‌గా నేహా శర్మ ఎంట్రీ ఇచ్చింది. ఐదవ కంటెస్టెంట్‌గా చలాకీ చంటి ఎంట్రీ ఇచ్చాడు. తన జీవితం, పెళ్లి, కూతురు అందరినీ ఒక ఏవీలో చంటి పరిచయం చేశాడు. మొత్తానికి అదిరిపోయే కమెడియన్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఆఫ్టర్ మ్యారేజ్ లవ్ గురించి నాగ్ ప్రశ్నించగా.. ఆమె లవ్ చేసిందని.. తన లవ్ స్టోరీ, పెళ్లిని గురించి వివరించాడు. అందరినీ ఎంటర్‌టైన్ చేస్తానని చెప్పి చంటి హౌస్‌లోకి అడుగుపెట్టాడు.