Bigboss 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6 సెప్టెంబర్ 4 నుంచి ప్రారంభం కానున్న విషయం తెలిసిందే. బిగ్‌బాస్.. ఏ భాషలో లాంచ్ అయినా సూపర్ హిట్ టాక్ కొట్టేసిందీ రియాల్టీ షో. తెలుగులోనూ ఐదు సీజన్ల పాటు సక్సెస్‌ఫుల్‌గా ప్రేక్షకులను అలరించింది. ఇప్పుడు ఆరో సీజన్‌కు సిద్ధమవుతోంది. త్వరలోనే ఇది ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. కొన్ని రోజుల కిందటే సెప్టెంబర్ 4 నుంచి బిగ్‌బాస్ తెలుగు షో ప్రసారం కానున్నట్టు ఆర్గనైజర్లు ప్రోమోను కూడా రిలీజ్ చేశారు. ఈసారి కూడా షోకు నాగార్జున హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. అయితే ఇప్పుడీ రియాల్టీ షోలో పాల్గొనబోయే కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఓ బజ్ క్రియేట్ అయింది.
యాంకర్ ఉదయభాను, యాంకర్ నిఖిల్, శ్రీహాన్, యాంకర్ నేహా చౌదరీ, యూట్యూబర్ ఆది రెడ్డి, గీతు రాయల్, చలాకీ చంటి జబర్దస్త్ అప్పారావుల పేర్లు ఫైనల్ అయినట్లు సమాచారం. వీళ్లతోపాటు మరికొందరు పేర్లు కూడా ఫైనల్ అయినట్టు తెలుస్తోంది. కాగా.. కంటెస్టెంట్ల లిస్ట్‌లో ప్రముఖ సింగర్ మోహన భోగరాజు పేరు కూడా వైరల్ అయ్యింది. అయితే ఆమె బిగ్‌బాస్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చింది. తను చాలా బిజీగా ఉన్నానని.. బిగ్‌బాస్ గురించి తననెవరూ స్పందించలేదని తెలిపింది. ఈ క్రమంలోనే తాజాగా బిగ్‌బాస్ ఎంట్రీపై తాజాగా చలాకీ చంటి స్పందించాడు.
Bigboss 6 : ఇంకో రెండు విషయాలు మిగిలిపోయాయి..
బిగ్‌బాస్ టీమ్‌తో దాదాపు చర్చలు అయిపోయాయి. కానీ ఇంకో రెండు విషయాలు మిగిలిపోయాయి. అవి రెండూ కంఫార్మ్ అయిపోతే ఇక అంతా ఓకే అయినట్లే’ అని తాను బిగ్‌బాస్ షోలో పాల్గొంటున్న విషయాన్ని చెప్పకనే చెప్పాడు.చంటి బిగ్‌బాస్ ఎంట్రీ కన్ఫర్మ్ అవడంతో ఈ సారి షోలో కామెడీకి ఏమాత్రం లోటు ఉండదని ప్రేక్షకులు చెప్పుకుంటున్నారు. అంతేకాకుండా ఈసారి బిగ్‌బాస్ షో కాంట్రవర్సీలకు కేరాఫ్‌గా మారుతుందని చెప్పుకుంటున్నారు. దీనికి తగ్గట్టే కంటెస్టెంట్ల ఎంపిక సైతం జరిగిందని టాక్. టాస్కులు, గేములు, కోపతాపాలు, నవ్వులు, లవ్ స్టోరీలు, కొట్లాటలు.. ఇలా అన్నీ ఒకేచోట దొరుకుతాయి కాబట్టి ప్రేక్షకులు సైతం 4వ తారీఖు కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.