Biggboss 6 : బిగ్ బాస్ తెలుగు సీజన్ 6.. రెండో వారం కూడా ముగింపు దశకు వచ్చేసింది. దాదాపు నాలుగు రోజులపాటు నామినేషన్స్, కెప్టెన్సీ టాస్క్‌లతో గడిచిపోయింది. ఇక కంటెస్టెంట్స్ అంతా కాస్త ఊపిరి పీల్చుకున్నారు.హౌస్‌లో కొత్త కెప్టెన్ ఛార్జ్ తీసుకున్నాడు. మొదటివారం బాలాదిత్య హౌస్‌కి కెప్టెన్ కాగా.. రెండోవారం ఓటింగ్ విధానంలో మోడల్ రాజశేఖర్ కెప్టెన్‌గా ఎంపికయ్యాడు. సాధారణంగా బిగ్ బాస్ రియాలిటీ షోకు ఉన్నంత క్రేజ్ మరే షోకు ఉండదు. దీనిని కొన్ని సినిమాల హీరో హీరోయిన్స్ తమ చిత్రాల ప్రమోషన్ కోసం వినియోగించుకుంటూ ఉంటారు. తాజాగా సుధీర్ బాబు- కృతిశెట్టి నటించిన ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’ అనే సినిమా నేడు అంటే సెప్టెంబర్ 16న విడుదలైంది.
ఆ సినిమా ప్రమోషన్స్ కోసం ఆ సినిమా హీరో హీరోయిన్లు సుధీర్ బాబు- కృతిశెట్టి బిగ్ బాస్‌లో అడుగుపెట్టారు. క్కడ సభ్యులతో సరదా టాస్కులు చేయించారు. దీనిలో భాగంగా హౌస్‌మేట్స్ అంతా తమ టాలెంట్‌ను బయట పెట్టేశారు. ఎక్కువ మంది సూపర్ స్టార్ మహేష్ బాబుని ఇమిటేట్ చేసేందుకు యత్నించారు.
ముఖ్యంగా శ్రీహాన్- ఫైమా కామెడీ అందరినీ ఆకట్టుకుంది. శ్రీహాన్ నేను ఒక డైలాగ్ చెప్తాను అర్థమైపోతుంది అంటూ.. ఎవడాడు అంటాడు. అందుకు ఫైమా ఎవడీడు అంటూ సూపర్ టైమింగ్‌తో రియాక్ట్ అయ్యింది. రేవంత్ కూడా ఎవడు కొడితే దిమ్మతిరిగి మైండ్ బ్లాక్ అవుతుందో వాడే పండుగాడు అంటూ మహేశ్‌ని ఇమిటేట్ చేసేందుకు ట్రై చేశాడు.అయితే మహేశ్‌ని ఇమిటేట్ చేశాడో మరింకెవరినైనా ఇమిటేట్ చేశాడో అతనికే తెలియాలి.
Biggboss 6 : ఇలాంటి డైలాగ్స్ ఎంతమందికి చెప్పావంటూ శ్రీసత్య ఫైర్
ఇంక కొత్త కెప్టెన్ రాజ్ అయితే శ్రీ సత్యతో కలిసి ఓ సీన్ రీక్రియేట్ చేసేందుకు చాలా కష్టపడ్డాడు. నిజానికి మనోడు చాలా మోహమాటస్తుడు. ఇక లవ్ ప్రపోజ్ సీన్ చేయడానికి కాసింత పెద్దగానే కష్టపడాల్సి వచ్చింది. శారీలో చాలా బాగున్నావు నువ్వు అని శ్రీ సత్యతో రాజ్ అంటే.. ఇలాంటి డైలాగ్స్ ఎంతమందికి చెప్పావంటూ శ్రీ సత్య మీది మీదికి వెళుతుంది. అంటే మనం ఇద్దరం కలిసి డేట్‌కి వెళదాం అంటే.. శ్రీ సత్య ఈ రోజు డేట్ ఎంతో నీకు తెలియదా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యలో శ్రీహాన్ వచ్చి.. మావాడు ఈ వారం కెప్టెన్.. ఒప్పుకోవడానికి ఏంటని అడుగుతాడు. కెప్టెన్ అయితే ఒప్పుకుంటారా? అంటూ శ్రీహాన్ మీద శ్రీసత్య ఫైర్ అవుతుంది. మొత్తానికి ఈ స్కిట్ అంతా ఆద్యంతం సందడి సందడిగా సాగింది.