Chalaki Chanti:జబర్దస్త్ షో ద్వారా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న నటుడు చలాకి చంటి అంటే గుర్తుపట్టని వారు ఉండరు. మొదటిగా సినిమాల లో చిన్న చిన్న పాత్రలు చేసుకుంటూ వెండితెర లో కమెడియన్ గా మంచి పేరు తెచ్చుకున్నాడు. అయితే భీమిలి, ప్రేమ కావాలి లాంటి సినిమాల్లో నటించాడు. కానీ ఈ సినిమాల్లో నటిస్తున్నప్పుడు చంటి వ్యక్తిగతంగా చాలా కష్టపడ్డాడు.
అయితే తాజాగా చలాకి చంటి బిగ్ బాస్ సీజన్ 6 లో ఎంపికై బిగ్ బాస్ హౌస్ లోకి ఎంటర్ కూడా అయిపోయాడు. బిగ్ బాస్ హౌస్ లోకి ప్రవేశించిన చంటి టాప్ కంటెస్టెంట్స్ లో ఒకరిగా ఉంటాడు అని కూడా అందరూ అనుకున్నారు. ఇంకా చెప్పాలంటే బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అతన్ని ఎక్కువ రోజులు ఉంచాలని కూడా ఆలోచించి ఉంటారు.
కానీ చంటి మాత్రం ఐదో వారంలోనే వెళ్ళిపోవడం ఇలా అనుకున్నా వారందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.బిగ్ బాస్ హౌస్ లోకి చాలామంది ఆర్టిస్టులు వచ్చి వారి క్రేజ్ నే కాకుండా ఆదాయాన్ని కూడా పెంచుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జబర్దస్త్ లో నలుగురు కమెడియన్లు సెలెక్ట్ కాగా చివరికి చంటికే నిర్వాహకులు ఫిక్స్ అయ్యారు.
చంటి కి ఈ మధ్యకాలంలో సినిమా అవకాశాలు కూడా రావడం లేదు. అందువల్ల బిగ్ బాస్ లో అవకాశం రాగానే ఏమాత్రం వెనకడుగు వేయకుండా ఎలాగైనా టాప్ ఫైనల్ వరకు ఆడాలని అనుకున్నాడు.చంటి కచ్చితంగా ఐదో వారంలో ఎలిమినేట్ అవుతాడు అని ఎవరు ఊహించి ఉండరు. చంటి ఎలిమినేట్ అవుతాడనీ బిగ్ బాస్ నిర్వాహకులు కూడా అనుకుని ఉండరు. ఎందుకంటే బిగ్ బాస్ కంటెస్టెంట్స్లలో కామెడీ యాంగిల్ లో ప్రేక్షకులను అట్రాక్ట్ చేసే వారు లేరు.
చలాకి చంటి హౌస్ లోకి వచ్చిన మొదట్లో అతనిపై పాజిటివ్ ఆలోచన ఉన్నప్పటికీ బిగ్ బాస్ హౌస్ లో అతను పెద్దగా ఆకట్టుకున్నదేమీ లేదు. గొడవలలో కూడా అనవసరంగా చర్చలు మొదలుపెట్టి లాజిక్స్ లేని మాటలతో అతను ఇంకా చిరాకు తెప్పించేవాడని కామెంట్లు కూడా వచ్చాయి.
బిగ్ బాస్ లో చంటి ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అన్న విషయం ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. బిగ్ బాస్ లో ఎక్కువ గా రెమ్యునరేషన్ అందుకుంటున్న కంటెస్టెంట్స్ లో చంటి ఒకడు. అతనికి వారానికి 50 వేల వరకు ఇచ్చినట్లు సమాచారం. అయితే 5 వారాల్లో బిగ్ బాస్ ద్వారా 2 లక్షల 50 వేల వరకు చంటి అందుకున్నాడు.