Celebrities Business: ఏ బ్రాండ్ ప్రచారం చేయడానికి అయినా సినీ ప్రముఖ హీరోయిన్లు, హీరోలు ఆ బ్రాండ్ తరపున యాడ్లలో నటించి ఆ బ్రాండ్ తరపున ప్రచారం చేస్తూ ఉంటారు. కొందరు హీరో, హీరోయిన్లు నేరుగా ఇలాంటి వ్యాపారాలలో పెట్టుబడి పెడుతూ ఉంటారు. చాలామంది హీరోయిన్లు చర్మ సంబంధిత బ్రాండ్లపై ఎక్కువగా పెట్టుబడులు పెడుతూ ఉంటారు.
నటి రష్మిక మందనకు దేశవ్యాప్తంగా వచ్చిన క్రేజ్ చాలా రకాల చర్మ సంరక్షణ ఉత్పత్తులకు ఆమె బ్రాండ్ అంబాసిడర్ గా చేస్తూ ఉంది.తన చర్మాన్ని కంటికిరెప్పలా కాపాడుతున్నదనే కృతజ్ఞతతో ఏకంగా ప్లమ్‌గాడ్సెస్ కంపెనీలో రష్మిక పెట్టుబడి పెట్టినట్టు సమాచారం. అంతేకాదు, ఆ బ్రాండ్‌కు తనే అంబాసిడర్‌గా చేస్తుంది.
బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా కూడా ఇటీవల ‘అనోమలీ’ అనే స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రొడక్ట్స్‌ను మార్కెట్‌లో విడుదల చేసింది. ఇప్పటికే ఈ బ్రాండ్ కు అమెరికాలో మంచి క్రేజ్ ఉంది. బాలీవుడ్ నుంచి హాలీవుడ్ వరకు ప్రతిచోటా ఆమెకు ఎంతోమంది అభిమానులు ఉన్నారు. దీంతో ఏడాది క్రితం అమెరికాలో అనామలీ ఉత్పత్తులను మార్కెట్ చేసుకొని బాగానే సంపాదించింది. ప్రస్తుతం ప్రియాంక చోప్రా నైకా సంస్థలో పెట్టుబడులు పెట్టింది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్‌వీర్ సింగ్ స్వదేశీ బ్యూటీ ఉత్పత్తుల కంపెనీ అయిన షుగర్ కాస్మటిక్స్‌లో పెట్టుబడులు పెట్టాడు. రణ్‌వీర్ మాట్లాడుతూ ఎన్నో సంవత్సరాలుగా ఓ మంచి బ్యూటీ బ్రాండ్ కోసం ఎదురుచూశాను. షుగర్ కాస్మటిక్స్‌తో ఆ బాధ తీరిపోయింది. షుగర్ కాస్మోటిక్స్ భారతీయ మహిళలకు చాలా బాగా సెట్ అవుతుందని రణ్‌వీర్ చెప్పాడు.
పాన్ ఇండియా స్టార్ నయనతార సరిగ్గా ఏడాది క్రితం లిప్‌కేర్ వ్యాపారంలోకి అడుగుపెట్టింది.ద లిప్ బామ్ కంపెనీ ఓ బ్యూటీ రిటైల్ బ్రాండ్. చర్మవ్యాధి నిపుణురాలు రేణిత రాజన్‌తో కలిసి ఈ బ్రాండ్‌ను నయనతార లాంచ్ చేసింది. నయనతార మాట్లాడుతూ మా వినియోగదారుల కోసం బెస్ట్ ప్రొడక్ట్స్ అందిస్తున్నాం. మా కంపెనీ ఉత్పత్తులను చూసి గర్వపడుతున్నా’ అని చెప్పింది.
రానా దగ్గుబాటి మగవారి కోసం ప్రత్యేకమైన సౌందర్య సాధనాలను మార్కెట్లో కి తెచ్చాడు. ఫలితంగా రోపోసోతో కలిసి ‘డిక్రాఫ్’ బ్రాండ్ పేరుతో మగవారి కాస్మటిక్ ఉత్పత్తులలో రానా పెట్టుబడి పెట్టాడు. షేవింగ్ క్రీమ్స్, చర్మ సౌందర్య సాధనాలు ఈ బ్రాండ్‌లో ఉన్నాయి.ఇలా చెప్పాలంటే చాలామంది హీరోయిన్లు, హీరోలు సొంతంగా చర్మ, కేశాల సంరక్షణ బ్రాండ్స్ ఏర్పాటు చేశారు.