ఇద్దరమ్మాయిలతో సినిమాలో అల్లు అర్జున్ కి జోడీగా నటించిన అందాల భామ కేథరీన్ థ్రెసా. వరుణ్ సందేశ్ కి జోడీగా చమ్మక్ చల్లో అనే సినిమాతో తెలుగులోకి ఈ బ్యూటీ అడుగుపెట్టింది. ఆ తరువాత నానికి జోడీగా పైసా అనే సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టింది. ఆ సినిమా అనుకున్న స్థాయిలో హిట్ కాకపోయిన తరువాత ఏకంగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ కి జోడీగా నటించే ఛాన్స్ కొట్టేసింది. అయితే ఈ సినిమా కూడా పెద్దగా హిట్ కాలేదు. దీంతో కేథరీన్ కెరియర్ టాలీవుడ్ లో పెద్దగా పుంజుకోలేదు. ఆ తరువాత ఎర్రబస్సు,రుద్రమ్మ దేవి లాంటి సినిమాలలో ఈ అమ్మడు నటించింది. అలాగే తమిళంలో కూడా కార్తీ, విశాల్ లతో జత కట్టింది. ఈ సినిమాలు కూడా కేథరీన్ కి కెరియర్ పరంగా ఎలాంటి ప్లస్ కాలేదు. మళ్ళీ బన్నీ సరైనోడు సినిమాలో ఈ బ్యూటీకి అవకాశం ఇచ్చాడు. ఇందులో మెయిన్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ అయినా కూడా ఆమె కంటే పవర్ ఫుల్ రోల్ ని కేథరీన్ కి ఇచ్చారు.
ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కేథరీన్ కి కూడా నటిగా మంచి పేరు తీసుకొచ్చింది. గౌతమ్ నందా సినిమాలో గోపించంద్ కి జోడీగా నటించింది. ఈ మూవీ కూడా హిట్ అయ్యింది. చివరిగా ఈ బ్యూటీ కళ్యాణ్ రామ్ సూపర్ హిట్ మూవీ బింబిసారలో యువరాణి పాత్రలో కనిపించి మెప్పించింది. ఈ మూవీతో గ్రాండ్ సక్సెస్ ని కేథరీన్ తన ఖాతాలో వేసుకుంది. అందం, అభినయం ఉన్న కూడా ఈ అమ్మడు స్టార్ హీరోయిన్ మాత్రం కాలేకపోతుంది. అలాగే కెరియర్ లో సక్సెస్ రేట్ కూడా భాగానే ఉన్న ఈమె పేరు స్టార్ హీరోయిన్స్ జాబితాలోకి మాత్రం రావడం లేదు.
ఇదిలా ఉంటే ఇప్పుడు అల్లు అర్జున్ మరోసారి ఈ బ్యూటీకి అదిరిపోయే ఆఫర్ ఇచ్చినట్లు తెలుస్తుంది. పుష్ప 2 సినిమాలో పవర్ ఫుల్ నెగిటివ్ షేడ్స్ ఉన్న రోల్ కోసం అల్లు అర్జున్ కేథరీన్ ని రిఫర్ చేసినట్లు తెలుస్తుంది. సుకుమార్ కూడా ఈమెని ఫైనల్ చేశాడని టాక్ వినిపిస్తుంది. అయితే దీనిపై ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ అయితే లేదు. వాల్తేర్ వీరయ్య సినిమాలో కూడా కేథరీన్ ఓ ఇంటరెస్టింగ్ రోల్ లో కనిపిస్తుందని తెలుస్తుంది. సినిమాల పరంగా పెద్ద పెద్ద స్టార్స్ తోనే కేథరీన్ ప్రస్తుతం జతకడుతూ ఉండటం విశేషం.