Carrot Benefits: కూరగాయల్లో నిత్యం వినియోగించేది, ఎక్కువ మంది ఇష్టపడేది క్యారెట్. దీన్ని వండుకొని తినడంతో పాటు పచ్చిదైనా కూడా తినేస్తుంటారు. క్యారెట్ వినియోగం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. మెదడు ఆరోగ్యం కోసం క్యారెట్ తినాలని చెబుతుంటారు. రక్తాన్ని శుద్ధి చేయడంలో కూడా క్యారెట్ పాత్ర ప్రముఖంగా ఉంటుంది. క్యారెట్ లో విటమిన్ ఎ ఉంటుంది. దీని వల్ల కళ్లకు కూడా మేలు జరుగుతుంది. ఆయుర్వేదంలో కూడా క్యారెట్ తో చేకూరే ప్రయోజనాలను వివరించారు.
మొదట నారింజ రంగులో ఉండేది కాదట..
క్యారెట్ తొలుత ఇప్పుడున్న రంగులో ఉండేది కాదని తెలుస్తోంది. చాలా ఏళ్ల కిందట పసుపు, తెలుపు రంగులో క్యారెట్ ఉండేదట. ఇది క్రమంగా నారింజ రంగులోకి మారగానే ఇందులోని పోషకాలు కూడాపెరిగాయని చెబుతారు. రానురానూ క్యారెట్ సాగు కూడా పెరిగింది. క్యారెట్ మూలానికి సంబంధించి చాలా మూలాలు ప్రాశస్త్యంలో ఉన్నాయి. ముఖ్యంగా దీని మూల కేంద్రం సెంట్రల్ ఏసియాటిక్ సెంటర్ అని తెలుస్తోంది. ఇందులో వాయువ్య భారత్ తో పాటు ఇరాన్, ఆఫ్గనిస్తాన్, ఉజ్బెకిస్తాన్ తదితర ప్రాంతాలు ఉన్నాయని చెబుతారు.
అయితే, చాలా మంది క్యారెట్ అసలు మూలం పంజాబ్, కశ్మీర్ కొండలని చెబుతారు. మనదేశ వృక్ష శాస్ర్త నిపుణులు కూడా ఇదే చెబుతున్నారు. కొన్ని ప్రాంతాల్లో నేటికీ క్యారెట్ లో అడవి జాతులు పెరుగుతున్నాయి. మధ్యధరా ప్రాంతం కూడా క్యారెట్ మూలం అయ్యి ఉండొచ్చని భావిస్తున్నారు. క్రీస్తుపూర్వం వెయ్యి నాటికి ఆసియా ప్రాంతంలో క్యారెట్ ను వినియోగించినట్లు చరిత్రకారులు చెబుతున్నారు.
Carrot Benefits:
14వ శతాబ్దంలో చైనీయులు క్యారెట్లను పంట రూపంలో పండించడం మొదలు పెట్టారని తెలుస్తోంది. అలాగే యూరోపియన్లు కూడా 17వ శతాబ్దంలో పండించి వాటిని అమెరికాకు తీసుకొచ్చినట్లు చరిత్ర చెబుతోంది. అటు తర్వాత 18వ శతాబ్దంలో జపాన్ లో క్యారెట్లు పెరగడం మొదలైందని చెబుతున్నారు. ఇక మనదేశంలో క్యారెట్ చరిత్ర కూడా చాలా పురాతనమైంది. క్యారెట్ తో వాతం, కఫాలను నివారించవచ్చని చెబుతున్నారు. క్యారెట్ లో ఇనుము, సోడియం, కాపర్, బీటా కెరోటిన్, విటమిన్ ఎ, సి ఉంటాయి. ఫైల్స్, డయేరియా లాంటి జబ్బులను నివారించే శక్తి క్యారెట్ కు ఉంది.