Biggboss 6 : బిగ్‌బాస్ రెండో వారం ప్రారంభమైంది. నిన్న అసలు సిసలైన నామినేషన్ల పర్వం ముగిసింది. ఇక మిగిలిన వాటిలో ముఖ్యమైనది కెప్టెన్సీ టాస్క్. ఈ రోజు కెప్టెన్సీ టాస్క్ కూడా జరిగింది. దీనికి సంబంధించిన ప్రోమోను బిగ్‌బాస్ నిర్వాహకులు కొద్ది సేపటి క్రితం విడుదల చేశారు. కెప్టెన్సీ టాస్క్‌లో రేవంత్‌కు, చంటితో బాగానే గొడవ అయినట్టు తెలుస్తోంది. అంటే చంటి మాత్రం కూల్ గానే కనిపించాడు. రేవంత్ మాత్రం యథావిధిగా ఫైర్ అయ్యాడు. కెప్టెన్సీ పోటీదారుల కోసం బిగ్‌బాస్ సిసింద్రీ టాస్క్ నిర్వహించాడు. ఇందులో భాగంగా ప్రతి ఇంటిసభ్యులకు కంటెండర్‌షిప్ ఒక బేబీ రూపంలో లభిస్తుంది.
బేబీ బాగోగులు చూసుకుంటూనే సమయానుసారం బిగ్‌బాస్ కొన్ని ఛాలెంజెస్ ఇవ్వడం జరుగుతుంది. అసలే ఓసీడీ ఉన్న గీతూకి బేబీ డైపర్ మార్చమని ఆదేశం రావడంతో ఇంటి సభ్యులంతా ఆమెకు మరిన్ని డైరెక్షన్స్ ఇస్తూ జోకులేస్తుంటారు. పిల్లల్ని చూడగానే గిల్లాలనిపిస్తుందంటూ గీతూ కూడా కామెడీ చేసింది. ఇక గేమ్ విషయానికి వస్తే.. ఈ టాస్కులో గోనెసంచులతో నడుస్తూ బిగ్‌బాస్ ఇచ్చిన ఆదేశం మేరకు టాస్క్ పూర్తి చేయాల్సి ఉంటుంది. అలా టాస్కులో విజేతగా గెలిచిన వారు ఇంటి కెప్టెన్‌గా నియమించబడతారు. ఈ గేమ్‌లో సాక్స్ అండ్ షేప్ టాస్క్ ఇస్తాడు బిగ్‌బాస్. ఈ టాస్క్‌లో చలాకీ చంటి,ఫైమాలతో రేవంత్‌కి గొడవ జరిగినట్లు ప్రోమోను బట్టి అర్థమవుతుంది.
Biggboss 6 : యూ ఆర్ ది రియల్ ఫైటర్..
‘గేమ్ పోతేపోనీ కానీ, ఒకల్ని ఓడగొట్టాలని చూస్తే మనమే ఓడిపోతాం కంగ్రాట్స్ చంటి అన్నా’ అంటూ రేవంత్ తన ఆవేదనని ప్రదర్శిస్తాడు. అదే సమయంలో ‘ యూ ఆర్ ది రియల్ ఫైటర్ ఓకే’ అంటూ ఆదిరెడ్డిని రేవంత్ అప్రిషియేట్ చేస్తాడు. తర్వాత ఫైమాతోనూ వాదనకు దిగగా.. ‘నువ్వు గెలవడానికి నేను ఆడటం ఎందుకు అన్నా’ అంటూ రేవంత్‌కి ఫైమా కౌంటర్ ఇచ్చింది. అభినయ శ్రీ కూడా ఈ టాస్క్‌లో గేమ్ ఛేంజర్ ఫైమా అంటూ నిందిస్తుంది. ప్రస్తుతం దీనికి సంబంధించిన ప్రోమో నెట్టింట చక్కర్లు కొడుతుంది. మరి ఈ టాస్కులో విజేతగా గెలిచి రెండో ఇంటి కెప్టెన్‌గా ఎవరు నిలుస్తారన్నది చూడాల్సి ఉంది.